భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 97,894 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 51,18,254 కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 1,132 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు మొత్తం మరణించిన వారి సంఖ్య 83,198 కి చేరింది.

ఇక వైరస్ నుండి ఇప్పటివరకు 40,25,079 మంది కోలుకోగా, ఇంకా 10,09,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.53 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.63 శాతంగా ఉంది. ఇక మరణాలలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్, బ్రెజిల్ తరువాత స్థానంలో కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,36,613 కరోనా టెస్టులు చేయగా, ఇప్పటివరకు మొత్తం టెస్టులు సంఖ్య 6,05,65,728 కి చేరింది.

తెలంగాణలో 1,000 దాటిన కరోనా మరణాలు..!

అల్లు అర్జున్ పై పోలీసులకు పిర్యాదు..!

మొదలైన ఆర్జీవీ బయోపిక్.. దర్శకుడిగా 20 ఏళ్ళ యువకుడు..!

‘ఖైదీ’ దర్శకుడితో కమల్ హాసన్ భారీ ప్రాజెక్ట్..!