దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. గత వారం రోజుల నుండి దేశవ్యాప్తంగా 6000 కేసులు పైన నమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6566 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 158333 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియచేసింది. ఇక దేశవ్యాప్తంగా తాజాగా 194 మంది మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 4531 కి చేరింది. ఇక మొత్తం బాధితుల్లో 67692 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 86110 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలలో కరోనా వైరస్ ఆందోళనకరంగా ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా వైరస్ తీవ్రత ఎక్కువుగా ఉన్న దేశాల్లో భారత్ 10వ స్థానంలో ఉంది.

గొంతు మీద కాలు తొక్కి పెట్టి.. ఓ పోలీస్ అరాచకం..!

సొంతూర్లకు వెళ్ళడానికి పశువులు అమ్మి విమాన టికెట్స్ కొన్నారు.. అయినా కూడా..!