భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కేవలం గత 11 రోజుల్లోనే 10 లక్షల మంది కోలుకోవడం విశేషం. దీంతో రోజువారీ పాజిటివ్ కేసుల కంటే ఒక్కోసారి రికవరీల సంఖ్య ఎక్కువుగా ఉంది. దీంతో ఇప్పటివరకు మొత్తం 50,16,520 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక నిన్న తాజాగా 82,170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 60 లక్షల 74 వేలకు చేరింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 57,32,518 కి చేరింది. ఇక 9,62,640 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 1,039 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు మొత్తం మరణించిన వారి సంఖ్య 95,542 కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,09,394 కరోనా టెస్టులు చేయగా, ఇప్పటివరకు మొత్తం టెస్టులు సంఖ్య 7,19,67,230 కి చేరింది.

లేటు వయసులో డిగ్రీ పరీక్ష రాసిన సినీనటి..!

అసాధ్యమనుకున్న టార్గెట్‌ను చేధించిన రాజస్థాన్ రాయల్స్..!

బిగ్ బాస్ లో ఊహించని షాక్..!