దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. అయితే రికవరీ రేటు కూడా భారీగా పెరుగుతుండడం విశేషం. గడచిన 24 గంటల్లో 1020 మంది కరోనా నుండి కోలుకున్నట్లు కేంద్ర, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశంలో ఇప్పటివరకు 12726 మంది కోలుకోగా, రికవరీ రేటు 27.41 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి పేర్కొన్నారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 46433 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. ఇక దేశవ్యాప్తంగా తాజాగా 195 మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 1568 కి చేరింది. ఇక మొత్తం బాధితుల్లో 12727 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 32138 మంది చికిత్స పొందుతున్నారు. కాగా భారత్ లో ఒకేరోజులో కరోనా భారిన పడిన అత్యధిక కేసులు మరణాలు ఇదే కావడం గమరణార్ధం. ఇక ఇప్పటివరకు 11 లక్షల మందికి కరోనా వైద్యపరీక్షలు జరిపినట్లు భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్నా.. ఇది త్వరలోనే స్థిరీకరణ చెందుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కటింగ్ చేయనన్నందుకు బార్బర్ ను కాల్చి చంపాడు..!

ఏపీలో తొలిరోజు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఆదాయం ఎంతో తెలుసా..!

కారు ప్రమాదంలో యువ నటుడు మృతి..!

ప్రముఖ యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు నమోదు..!