భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 60,963 పాజిటివ్ కేసులు నమోదుకావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,29,638 కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 834 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు కరోనాతో మొత్తం మరణించిన వారి సంఖ్య 46,091 కి చేరింది. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 2.07గా ఉంది.

ఇక గడచిన 24 గంటల్లో 56,110 మంది డిశ్చార్జ్ కావడంతో ఇప్పటివరకు మొత్తం 16,39,599 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం 6,43,948 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 70.38 శాతం ఉండగా.. మరణాల రేటు 1.98 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో 7,33,449 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,60,15,297 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

ఓ గర్భిణికి పురుడు పోసిన ఎమ్మెల్యే..!

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉదృతి.. భారీగా నమోదైన కొత్త పాజిటివ్ కేసులు..!