భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో కొంత ఊరట లభించింది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్కరోజు వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో కోలుకోవడం ఇదే తొలిసారి. దీంతో రికవరీ రేటు 80 శాతం దాటింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కోలుకుంటున్న వారిలో భారత్ లోనే ఎక్కువుగా ఉన్నట్లు కేంద్ర స్వష్టం చేసింది.

ఇక తాజాగా 24 గంటల్లో కొత్తగా 75,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 55,62,663 కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 1,053 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు మొత్తం మరణించిన వారి సంఖ్య 88,935 కి చేరింది.

ఇక వైరస్ నుండి ఇప్పటివరకు 44,97,000 మంది కోలుకోగా, ఇంకా 9,75,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ఇక మరణాలలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్, బ్రెజిల్ తరువాత స్థానంలో కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,33,185 కరోనా టెస్టులు చేశారు.

యువతిపై చేయిచేసుకున్న కార్పొరేటర్.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

వాళ్ళను వదిలే ప్రసక్తేలేదంటున్న శివబాలాజీ..!

యాపిల్ ఐఓఎస్14 సరికొత్త ఫీచర్స్..!

ఈ పుష్పంతో ఏ వ్యాధినైనా నయం చేయవచ్చట..!