గురువారం కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఇండియన్-2 లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఎత్తుగా కనిపిస్తున్న ఓ కోటపై నిలబడి ఉన్న కమల్ ఫోటోను విడుదల చేశారు. ఇక 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన కమల్.. కుటుంబసభ్యులతో కలసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.