అక్టోబర్ 2020 బ్యాచ్ కు సంబంధించి ఇండియన్ నేవీలో నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల నవంబర్ 23 నుంచి మొదలు కానున్న ఈ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 28తో ముగుస్తుంది. ఇండియన్ నేవీలో 400 సెయిలర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత కాగా అక్టోబర్ 1, 2000 నుంచి సెప్టెంబర్ 30, 2003 మధ్యన ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి జన్మించి ఉండాలి. పెళ్లి కానీ పురుషులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇండియన్ నేవి అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 10వ తరగతి గుర్తింపు ఉన్న బోర్డులో పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్/ఓబీసీ విద్యార్థులకు 215 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు లేదు.

2019 పేస్కేల్ ప్రకారం ప్రతి నెల 14,600 రూపాయలు జీతం ఇస్తారు

దరఖాస్తు తేదీ ప్రారంభం : 23 నవంబర్ 2019
దరఖాస్తు తేదీ ముగింపు : 29 నవంబర్ 2019

దరఖాస్తు అప్లై చేసుకోవాలి అనుకున్న వారు ఇక్కడ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి : https://www.joinindiannavy.gov.in/