ఇండియా పోస్ట్ ఏపీ పోస్టల్ సర్కిల్ పరిధిలో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. పదవతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏపీ తెలంగాణాలో మొత్తం 3677 ఉద్యోగాలకు దరఖాస్తు రేపటితో అంటే నవంబర్ 14తో గడువు ముగియనుంది. ఏపీలో 2707 పోస్టులు, తెలంగాణలో 970 పోస్టులకు పదవ తరగతి పూర్తి చేసినవారు అర్హులు. ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ కేటగిరిలో పురుషులు మాత్రమే దరఖాస్తుకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

మిగిలిన వారికి ఫీజు లేదు. ఆన్ లైన్ ద్వారా లేదా పోస్టాఫీస్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మొదటగా రిజిస్టేషన్ చేసుకున్న తరువాత ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పదవ తరగతిలో మీరు సాధించిన మార్కుల ప్రకారం ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.

గత నెల అక్టోబర్ 15 నుంచి రేపు నవంబర్ 14 వరకు రిజిస్టేషన్ చేసుకొని ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది.

ఈ పోస్టులు కేవలం ఆన్ లైన్ దరఖాస్తు చేయాలి. ఆసక్తి గలవారు https://www.indiapost.gov.in/ లేదా http://appost.in/gdsonline/ వెబ్ సైట్ లో రిజిస్టేషన్ చేసుకోవాలి.

ఒక అభ్యర్థి ఒక్కసారి మాత్రమే రిజిస్టేషన్ చేసుకోవాలి. ఒక అభ్యర్థి వాడిని రిజిస్టేషన్ మొబైల్ నెంబర్ మరొక అభ్యర్థి వాడటానికి ఉండదు. అలా వాడితే తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •