డెంగ్యూ అనేది ఎగిరే కీటకాలతో కూడుకుని ఉన్న “విషపూరిత నీరు”గా ఉదాహరించబడింది. 17వ శతాబ్దంలోనే అంటు రోగాలు ఉన్నప్పటికీ… డెంగ్యూ అంటు రోగం 1779 మరియు 1780 నుంచి ఉన్నాయి. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందినట్లు ఎక్కడా లేదు. ఇది దోమల నుంచి మనుషులకు వ్యాప్తి చెందిన కేసులు మాత్రమే ఉన్నాయి. ఏడెస్ ఈజిప్ట్ దోమ కాటు నుంచి ఇది మొదలయింది.

డెంగ్యూ మొదటి సారి భారతదేశంలో న్యూఢిల్లీలో 2015లో వ్యాపించింది. ఆ సమయంలో అత్యంత ఘోరంగా వ్యాపించడంతో పాటు దాదాపుగా 10 వేల మందికి డెంగ్యూ పాజిటివ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 32 మరణాలు సంభవించాయి. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రద్దీగా మారిపోయాయి. ఆసుపత్రులలో పడకలు చాలక ఒక్కో పడకపై ఇద్దరు, ముగ్గురు రోగులు పడుకున్నారు. 

డెంగ్యూ దోమల వ్యాప్తి ఎక్కువగా ఆఫ్రికా, భారత్, తైవాన్, దక్షిణ చైనా, పసిఫిక్ దీపాలు, మెక్సికో, దక్షిణ అమెరికా వంటి ఉష్ణ, సమ శీతోష్ణ దేశాలలో వస్తుంది. ఈ దేశాలలో వాతావరణం వేడిగా, తేమ అధికంగా ఉండటంతో దోమలు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 70 నుంచి 100 మిలియన్ల మంది డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు. 

డెంగ్యూ జ్వరం వస్తే దానిని నుంచి రక్షించడానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు(కానీ డెంగ్యాక్సియా అనేది ఒక మినహాయింపు ఇది యూఎస్ నుంచి మొదలయింది) దోమ కాటుని నివారించడం వలన మాత్రమే దీనిని రాకుండా నివారించుకోగలం. ఎఫ్.డీఏ ఆమోదించిన డెంగ్యాక్సియా వ్యాక్సిన్ తో అంతక ముందు ల్యాబ్ ధ్రువీకరించిన డెంగ్యూ ఇన్ఫెక్షన్ ను 9 నుంచి 16 సంవత్సరాల పిల్లలలో నివారణలో సాధ్యమే అని నిరూపించబడింది. వృద్ధులకు టీకాలు మరియు హోమియో అందుబాటులో ఉన్నాయి. డెంగ్యూకు ఇంటి నివారణ లేదా చికిత్స లేదు.

డెంగ్యూ దోమ కాటుకు గురైతే వ్యాధి యొక్క తీవ్రతను బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. దోమ కాటుకి గురైన ఏడు రోజుల వరకు లక్షణాలు కనిపిస్తాయి. మొదటగా కండరాలు మరియు కీళ్ల నొప్పులు, అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు మరియు వికారం కలగడం జరుగుతుంది. డెంగ్యూ చాల అరుదుగా తీవ్రమైన లేదా ప్రాణాంతక సమస్యలు కలిగి ఉంటుంది.

డెంగ్యూ దోమలను నివారించడానికి భారీగా సువాసనలు వెదజల్లే సబ్బులు దూరంగా ఉండటం ఉత్తమం

తెల్లవారు జామున, సాయంత్రం మరియు రాత్రి వేళల్లో బయటకు రాకపోవడం ద్వారా డెంగ్యూని కాస్త అరికట్టవచ్చు. 

నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, చెత్త చెదారం నిల్వ ఉండే చోట్ల శుభ్రం చేయాలి.

ఫ్రిడ్జ్ కింద ఉండే నీటి ఫ్యానుల్లో నిల్వ ఉండే నీటిలో కూడా దోమలు పెరుగుతాయి.

ఇలా దోమలు వ్యాప్తి చెందకుండా ఎలాంటి మార్గాలు తీసుకోవాలో వాటన్నిటిని తీసుకోవడం వలన డెంగ్యూ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

  •  
  •  
  •  
  •  
  •  
  •