కరోనా వైరస్ మహమ్మారి సెలూన్ లాంటి ప్రదేశాలలో ఎక్కువ వ్యాపిస్తుందని, ఆ ప్రాంతాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సెలూన్ కు అవసరమైతేనే వెళ్లాలని, ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మీరు సొంతగా మీపై కప్పుకుని క్లాత్ ను తీసుకొని వెళ్లాలని ఎంత చెప్పినా మాకెందుకు కరోనా వైరస్ వస్తుందిలే అని అశ్రద్ధ చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని ఒక సెలూన్ లో పనిచేసే వ్యక్తికి కరోనా వైరస్ ఉండటంతో అతడి నుంచి 91 మంది వైరస్ సోకినట్లు వార్తలు రావడం కాస్త కలకలం రేపుతోంది. ఆ సెలూన్ కు చాలా మంది వచ్చి వెళ్లిన అందరూ మాస్క్ లు పెట్టుకోవడంతో వైరస్ అందరకి వ్యాపించలేదని అక్కడ ప్రభుత్వం చెబుతుంది.

అమెరికాలో ఇప్పటికే వైరస్ ను అరికట్టలేక అక్కడ ప్రభుత్వం పక్క దేశాలపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ మాదేమి తప్పులేదనట్లు నటిస్తుంది. ఇక లాక్ డౌన్ నియమాలను కూడా పూర్తి కట్టుదిట్టంగా పాటించేలా చేయకపోవడంతో వ్యాపారస్తులు కూడా తమ బిజినెస్ పోతుందని భయపడ్డారు తప్ప కరోనా వైరస్ ఎంత సోకుతున్న లెక్కచేయకుండా షాపులను లాక్ డౌన్ సమయంలో తీసి ఉంచి వైరస్ మరింత వ్యాప్తి చెందేందుకు దోహదం చేసారు

నిన్న ఒక్కరోజే అమెరికాలో 21,929.కరోనా వైరస్ కేసులు రాగా, 1036 మంది చనిపోయారు. ప్రపంచం మొత్తం అన్ని దేశాలు కరోనా వైరస్ ను కట్టడి చేస్తుంటే అక్కడ ప్రభుత్వం మాత్రం మొదటి నుంచి ఆర్ధికంగా ఎదగాలని, ప్రపంచంలో తామే అగ్రదేశంగా ఉండాలని తాపత్రయ పడుతుందే తప్ప కరోనా వైరస్ కంట్రోల్ చేద్దామన్న ద్యాస కనపడటం లేదు. రాబోయే రెండు రోజులలో 17 లక్షల మార్క్ అమెరికాలో దాటనున్నట్లు ప్రస్తుత కేసులను బట్టి తెలుస్తుంది.

నిరుపేదలకు సహాయం చేస్తున్న ప్రముఖ హీరోయిన్..!

నంద్యాల ఉపఎన్నిక మొత్తం ఆటనే మార్చేసింది