గతంలో భారత్ వాయుసేన బాలాకోట్ లోని జైష్ స్థావరంపై చేసిన దాడితో పాటు ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ రగిలిపోతుంది. ఇక అందులో భాగంగా పాకిస్థాన్ వెనక నుంచి ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ భారత్ మీదకు దాడులకు సన్నద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం దాదాపుగా భారత్ పై 40 మంది జీహాదీలను జైష్ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తుంది.

ఇంటిలిజెన్స్ వర్గాల తాజా సమాచారం ప్రకారం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ తో పాటు, మహారాష్ట్ర, గుజరాత్ కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో దాడులకు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తుంది. ఈ శిక్షణ మొత్తం బాలాకోట్ వేదికగా నడుస్తుందట. దీని వెనుక పాకిస్థాన్ వ్యూహరచన చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. పాకిస్థాన్ ఇలా ఉగ్రవాదులను పెంచి పోషించి దాడులకు తెగబడేలా చేస్తుంది. ఎన్నిసార్లు పాకిస్థాన్ కు హెచ్చరికలు చేసినా ఇలాంటి చర్యలను ఆపకపోగా మరింత ఎక్కువగా భారత్ పై కాలు దువ్వుతుంది.