మన భారతదేశంలో దేవుళ్ళు, దేవతలు, చెట్లు, దెయ్యాలు వీటన్నింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రతి ఊరిలో ఒక్కో దేవతను గ్రామ దేవతగా పూజిస్తుంటారు. ఇక దేవతలతో పాటు పురాతనంగా వందలేళ్ళ నాటి చెట్లను కూడా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అంటే మనం చెట్లను కూడా దేవుళ్ళు, దేవతలతో కొలుస్తుండటంతో మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాం. ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేసేవారుంటారు. కానీ అలా కొట్టిపారేసేవారు దేవుళ్లను కొలిచే వారితో పోలిస్తే నూలుపొగంత మంది కూడా ఉండరు. సరే ఇక కథలోకి వెళ్లి ఈ మూడు తలలు చెట్టు గురించి తెలుసుకుందాం.

1912 నుంచి 1919 వరకు పొయార్ పాక్ అనే వ్యక్తి దేశమంతా తిరిగాడు. అతడు విదేశీయుడు కావడంతో పాటు అతడు పెరిగిన వైవిధ్యమైన జీవనంలో అతడికి మత విశ్వాసాలు తక్కువే అతడు చిత్రకారుల దగ్గర సహాయకుడిగా పనిచేసేవాడు. అతడు శామ్యూల్ అనే చిత్రకారుడి దగ్గర పనిచేస్తున్నాడు. శామ్యూల్ ఎంతో అందంగా చిత్రాలను మలిచేవాడు. అతడు ఏ చిత్రం గీసినా అది బ్రిటిష్ సామ్రాజ్యానికి సొంతమని అతడు నమ్మాడు. భారతదేశాన్ని అంతా బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలించాలని బలంగా నమ్మేవాడు. అలా శామ్యూల్ దగ్గర పొయార్ పాక్ సహాయకుడిగా చేరి చిత్రాలు గియ్యడానికి ఉపయోగపడే సామాగ్రిని మోసుకుంటూ వెళ్ళేవాడు.

శామ్యూల్ కొంతమంది ద్వారా గజర్వాడ్ అనే కుగ్రామంలో మూడు తలలు చెట్టు ఉన్నదని, దాని దగ్గరకు వెళ్లడానికి కూడా ప్రజలు బయపడేవారని తెలుసుకున్నాడు. ఈ మూడు తలలు చెట్టు చిత్రాన్ని గీయడానికి స్వయంగా శామ్యూల్… పొయార్ పాక్ తో కలసి ఆ గ్రామానికి బయలుదేరాడు. శామ్యూల్ వయస్సు 70 ఏళ్ళు కానీ అతడి దేహం అతడి ఎత్తు చూస్తే ముప్పైఏళ్ళ అజనబాహుడిలా బలిష్టంగా ఉండేది. రోజుకి 30 మైళ్ళు అవలీలగా ఇంత వయస్సులో కూడా నడిచేవాడు. 70 ఏళ్ళ వయస్సులో కూడా అతడికి పడక సుఖం కావాల్సిందే. రాత్రయితే ఒక భారతీయ స్త్రీ అతడి సొంతమవ్వాలని కోరుకుంటుంటేవాడు. అతడు అనుకున్నది అనుకున్నట్లు అలా జరిగిపోయేది కూడా.

శామ్యూల్… పొయార్ పాక్ కు వెంట పెట్టుకొని ఎడ్ల బండిపై ఆ గ్రామానికి బయలుదేరాడు. శామ్యూల్ వస్తున్నాడని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ముందుగానే గ్రామాధికారి చెప్పడంతో అతడు గొడుగు పట్టుకొని శామ్యూల్ కోసం వేచి చూస్తున్నాడు. శామ్యూల్ ఆ గ్రామంలోకి రాగానే ముందుగా తాను చెట్టు చూడాలని కోరడంతో ఆ గ్రామాధికారి అది మాములు చెట్టు కాదని, ఆ చెట్టు ఒక గ్రామ దేవత అని నేరుగా చెట్టు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. శామ్యూల్ వ్యంగ్యంగా గ్రామ దేవతగా భారతీయులు చెట్లను కూడా పూజిస్తారా అంటుండగా గ్రామాధికారి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నవ్వి ఊరుకున్నాడు

శామ్యూల్ ఆ చెట్టుని ఆశ్చర్యంగా చూస్తూ, మూడు రకాలైన ఆకులు ఒకే చెట్టుగా ఎలా ఏర్పడ్డాయ్ అంటూ అతడి చెట్టు చుట్టూ తదేకంగా చూస్తూ ప్రదక్షణ చేసి రాగా, అతడు చెట్టుని పట్టుకోవాలని ప్రయత్నించగా గ్రామాధికారి ఆ చెట్టుని తాకవద్దని కోరాడు. కానీ శామ్యూల్ మాత్రం ఆ చెట్టుకున్న కఠినమైన బెరుడుని తొలిచి చూశాడు. కనీసం ఈ చెట్టు వందసంవత్సరాల పైనే ఉంటుందని చెప్పాడు. ఇలాంటి చెట్టుని ఇంతవరకు తాను ఎక్కడ చూడలేదని, చాలా వింతగా ఉందని శామ్యూల్ అన్నాడు.

ఆ గ్రామాధికారి చెబుతూ మూడు వేరు వేరు చెట్లు ఒకే కాండంగా పెరిగిందని చెప్పగా, శామ్యూల్ వింతగా తీక్షణంగా ఆ చెట్టుని చూడసాగాడు. వెంటనే తాను వచ్చిన పని మొదలుపెట్టాలని చిత్రాన్ని గీయడానికి సన్నద్ధమవుతున్నాడు. పక్కనే ఉన్న పొయార్ పాక్ ఒక కుర్చీ తీసుకురావాలని కోరగా, ఒక అందమైన యువతి శామ్యూల్ కు కుర్చీ తీసుకొని వచ్చింది. శామ్యూల్ ఆమె ఎదను తీక్షణంగా కళ్ళార్పకుండా చూస్తున్నా ఆమె ఎలాంటి హావభావాలు చూపించకుండా పక్కన నిలబడింది.

ఇక శామ్యూల్ చిత్రాన్ని గీయడం మొదలు పెట్టాడు. అతడు చిత్రాన్ని గీయడానికి అవసరమైన స్టాండ్, రంగులను, కుంచెను పొయార్ పాక్ తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నాడు. చెట్టుని ఎక్కడ నుంచి గీయాలో తెలియక తనకు ఎదురుగా ఉన్న ఎత్తైన ప్రదేశంలో నిలబడి గీయాలని నిర్ణయించుకున్నాడు. శామ్యూల్ ముందుగా చిత్రాన్ని గీయడానికి నోటు పుస్తకంపై పెన్సిల్ తో గీసి ఆ తరువాత కుంచెతో పెద్ద చిత్రాన్ని గీసేవాడు.

ఇలా చెట్టు చిత్రాన్ని గీయడానికి రెడీ అవుతున్న సమయంలో ఆ గ్రామాధికారి ఇలా చెట్టుని చిత్రంగా మలచడం అవసరమా అని అడగగా శామ్యూల్ అవేవి పట్టించుకోలేదు. పొయార్ పాక్ ఆ గ్రామాధికారి వైపు అలానే చూస్తుండగా అతడు ఏదో దాస్తున్నాడనిపించింది. గ్రామాధికారి తనకు వచ్చిన అరకొర ఇంగ్లీష్ ఇంతవరకు ఈ చెట్టుని ఎవరు బొమ్మ గీయలేదని అకాస్త జాగ్రత్తగా ఉండమని కోరాడు. కానీ పొయార్ పాక్, శామ్యూల్ అతడి మాటలు లైట్ తీసుకున్నారు. చెట్టు బొమ్మ సగం వరకు గీయగా, సాయంకాలం అవ్వడంతో మిగతా సగం రేపు గీయవచ్చని ఆ గ్రామంలోనే ఆ రాత్రి గడపాలని అనుకున్నారు.

అక్కడే ఉన్న యువతీ పొయార్ పాక్ ఎప్పటి నుంచో తెలిసినవాడిలా అతడితో మాట్లాడి చిన్న నవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్లిపోయింది. గ్రామాధికారి అదే గ్రామాలో ఒక పూరి గుడిసెలో వారికి ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటికి ఆ కుర్చీ తెచ్చిన యువతి అక్కడకు రావడంతో శామ్యూల్… పొయార్ పాక్ ను ఇంట్లోనుంచి కుక్కను తరిమినట్లు తరమడంతో అతడు ఆ గ్రామాధికారి ఇంటి బయట ఆ రాత్రి నిద్రపోయాడు. ఉదయం శామ్యూల్ నిద్ర లేచి ఒంటరిగా ఆ ఊరికి పడమర దిక్కు ఉన్న శిథిలావస్థకు చేరుకున్న ఒక కోటవైపు బయలుదేరాడు.

కొద్దిసేపటికి గ్రామాధికారి రావడంతో పొయార్ పాక్ కూడా ఆ దిక్కుగా వెళ్ళాడు. అక్కడ ఎంత వెతికినా శామ్యూల్ కనపడలేదు. మరోదిక్కు వేళ్ళాడేమో అని ఊరంతా కలసి వెతికినా శామ్యూల్ జడ మాత్రం కనిపించలేదు. ఇలా మూడు నాలుగు రోజులు వెతికినా శామ్యూల్ జాడ దొరకకపోవడంతో పొయార్ పాక్ ఆ గ్రామాధికారిని అసలు శామ్యూల్ ఏమైపోయాడని, ఎందుకు ఇలా కనిపించకుండా వెళ్లాడని ఒకవేళ ఏదైనా పురుగు పుట్రా కరిస్తే ఎక్కడైనా శవంగా అయినా కనపడాలి కదా అని అడిగాడు.

దానికి గ్రామాధికారి చెబుతూ ఈ చెట్టు బొమ్మ గీయాలని ఎవరు చూసినా వారు బతికి బట్ట కట్టలేదని, అది తాను చెబుదామనుకున్నా దొర పట్టించుకునే పరిస్థితిలో లేరని గమనించినట్లు చెప్పుకొచ్చాడు. పొయార్ పాక్ ఆశ్చర్యంగా చెట్టు చిత్రాన్ని గీస్తే శిక్షిస్తుందా అని అడుగగా, “మిమల్ని ఎవరైనా దిగంబరంగా చిత్రీకరిస్తే మీరు అంగీకరిస్తారా ప్రశ్న వేయగా పొయార్ పాక్ నోటి నుంచి మాట రాలేదు. అయినా చెట్టు, మనిషి ఒకటేలా అవుతారని అడుగగా, తాము చెట్లకు కూడా పెళ్లిళ్లు చేస్తామని అన్నాడు. చెట్లకు పెళ్లా అని అయ్యోమయ్యంగా పొయార్ పాక్ అడిగాడు. అవన్నీ మీకు అర్ధం కావులే… బండి తయారుగా ఉంది మీరు ఇక వెళ్లిపోవచ్చన్నాడు.

ఆ గ్రామం నుంచి తిరిగి వెళ్లిపోయేటప్పుడు మరోసారి పొయార్ పాక్ చెట్టు వైపు ఎగాదిగా చూశాడు. ఏనుగు చెవులు కదులుతున్నట్లు మితమైన వేగంతో కొమ్మలు కదులుతున్నాయి. ఇండియా అంటేనే దేవుడు నివసించే స్థలం. ఇక్కడ మనుషులనే కాదు చెట్లను కూడా మనం అర్ధం చేసుకోలేమని గొణుక్కున్నాడు. ఈ సంఘటన జరిగిన ఏడవ రోజు కంపెనీకి అధికారిక చిత్రకారుడిగా పొయార్ పాక్ నియమించపడ్డాడు. ఇక శామ్యూల్ కడుపు నొప్పితో చనిపోయినట్లు రికార్డులలో నమోదు చేశారు. అప్పటి నుంచి పొయార్ పాక్ విచిత్రాలను వెతికి చూడటం జీవిత దెయ్యంగా ఎంచుకున్నాడు. ఇంతకు శామ్యూల్ ఎలా చనిపోయాడు. కుర్చీ తెచ్చిన యువతి, తమ గ్రామంలో బస చేసే సమయంలో రాత్రి పూట తమ దగ్గరకు వచ్చిన యువతే శామ్యూల్ ను మట్టుపెట్టిందా?

గణపతి శాస్త్రి చేసిన యాగం, సంజయ్ గాంధీ మరణానికి దారి తీసిందా?

32 ఏళ్లుగా గిరిజనులతో సావాసం, కానీ అతడి గత చరిత్ర తెలిస్తే నోట మాటరాదు