కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ లో జరగవలసిన ఐపీఎల్ టోర్నీ ఈ ఏడాది దుబాయ్ వేదికగా ఈనెల 19 నుంచి జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించి కొద్ది సేపటి క్రితం షెడ్యూల్ ను విడుదల చేశారు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈ ఏడాది మొదటి మ్యాచ్ చెన్నై వర్సెస్ ముంబై మధ్య అబుదాబి వేదికగా జరగనుంది. ఆగస్ట్ 19 నుంచి నవంబర్ 10 వరకు టోర్నీ నిర్వహించనున్నారు.

టోర్నీ ఇంకా మొదలు కాకముందే ఆటగాళ్లకు కరోనా ఫీవర్ పట్టిపీడిస్తుండటంతో ఇప్పటికే చెన్నై ఆటగాళ్లు సురేష్ రైనా, హార్బజన్ సింగ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ఇక రాబోయే రోజులలో ఈ సంఖ్య పెరుగుతుందని వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒక ఏడాది ఐపీఎల్ టోర్నీ ఆడకపోతే వచ్చే నష్టం లేదని కూడా ఆటగాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది.