పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ అభిమానులకు కావలసినంత క్రికెట్ మజా అందింది. అసాధ్యమనుకున్న టార్గెట్ ను ఛేదించి మ్యాచ్ ను రాజస్థాన్ జట్టు కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్ కు దిగి భారీ స్కోర్ సాధించింది. తొలి నుండి పంజాబ్ బ్యాట్స్ మెన్ లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో బౌండరీల మోత మోగించారు. మయాంక్(50 బంతుల్లో 106) సెంచరీతో మెరవగా.. రాహుల్(54 బంతుల్లో 69) అర్థ సెంచరీతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 224 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టుకు మొదటిలోనే దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ హిట్టర్ జాన్ బట్లర్ 4 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత కెప్టెన్ స్మిత్, శాంసన్ జట్టును ఆదుకున్నారు. అయితే అర్థ సెంచరీ తరువాత స్మిత్ అవుటైనా శాంసన్ పోరాటం కొనసాగించాడు. కానీ రిక్వైర్డ్ రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. ఇక ఈ ఒత్తిడిలో శాంసన్ 85 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక దీంతో అందరూ రాజస్థాన్ ఓడి పోతుందనుకున్నారు. కానీ తెవాటియా 18 ఓవర్ లో ఏకంగా 5 సిక్స్ లు కొట్టి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. ఆ తరువాత షమి ఓవర్లో ఊతప్ప అవుట్ కాగా క్రీజ్‌లోకి వచ్చిన ఆర్చర్ ఆదుకున్నాడు. ఇక 19.3 ఓవర్లలో రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 224 పరుగుల లక్యాన్ని చేధించింది.

బిగ్ బాస్ లో ఊహించని షాక్..!

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా.. జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల వివరాలు

బీజేపీ సరికొత్త స్ట్రాటజి, అక్కడ రెడ్లు, ఇక్కడ కమ్మ ఓటర్లకు గాలం వేసే దిశగా అడుగులు