ఢిల్లీ క్యాపిటల్స్ అల్ రౌండ్ ప్రదర్శనతో దూసుకుపోతుంది. సోమవారం బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 59 పరుగుల తేడాతో బెంగళూరును ఖంగు తినిపించింది. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఇక పృథ్వీ షా 42, ధావన్ 32, శ్రేయస్ 11, పంత్ 37, స్టొయినిస్ 53 , హెట్‌మైర్ 11 పరుగులు చేశారు.

ఇక ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేసి ఓటమి చెందింది. కెప్టెన్ కోహ్లీ 43 పరుగులు చేసాడు. మిగతా బ్యాటమెన్స్ ఎవరు కూడా సరైన స్కోర్ చేయలేకపోయారు. కగిసో రబడ (4/24) బెంగళూరు పతనాన్ని శాసించాడు. మరో పేసర్ నోర్జేకు రెండు వికెట్లు దక్కాయి. దీంతో ఢిల్లీ జట్టు 59 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది.