తొలి రెండు మ్యాచ్ లలో ఓటమి మూటగట్టుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్ ఎట్టికేలకు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 33 బంతుల్లో 45 పరుగులు, జానీ బెయిర్ స్టో 48 బంతుల్లో 54 పరుగులు, కెన్ విలియమ్సన్ 26 బంతుల్లో 41 పరుగులతో రాణించారు. దీంతో హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది.

ఇక ఆ తరువాత బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. తొలి ఓవర్లోనే పృథ్వీ షా (2)ను భువనేశ్వర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ టార్వ్హత్ వచ్చిన కెప్టెన్‌ శ్రేయాస్‌ (17), రిషబ్ పంత్ (28), హిట్‌మెయర్(21), కగిసో రబాడ(15), స్టాయినిస్(14) అంచనాలను అందుకోలేక పోయారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులే చేసింది. దీంతో హైదరాబాద్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

చైనాలో బయటపడ్డ మరో భయంకరమైన వ్యాధి.. ‘బ్లాక్ డెత్’..!

కరోనాపై కీలక విషయాలు వెల్లడించిన ఐసిఎంఆర్.. 15 మందిలో ఒకరికి కరోనా..!

బిగ్‌బాస్‌పై దేవి నాగవల్లి షాకింగ్ కామెంట్స్.. ఆ కంటెస్టెంట్ కి నా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి..!