గురువారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ 52, బెయిర్ స్టో 97 పరుగులతో రాణించారు. దీంతో హైదరాబాద్ జట్టు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ముందు ఉంచింది.

ఇక లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్లు రాహుల్ 11, మయాంక్ 9 పరుగుల చేసి విఫలం అయ్యారు. ఇక పూరన్ ఒక్కడే 77 పరుగులతో రాణించాడు. ఇక మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. దీంతో పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. ఇక హైదరాబాద్ జట్టు.. 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకుపోయింది.

సీఎం జగన్ కొట్టిన దెబ్బకు ఆ నాయుడుకి పెద్ద షాకే

జూనియర్ ఎన్టీఆర్ చెప్పినా తాము వినమని మొండికేస్తే మీ కర్మ

గంగవ్వ వలన బిగ్ బాస్ యాజమాన్యానికి కొత్త ఇబ్బందులు