ఐపీఎల్ 2020 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ బోణీకొట్టింది. హైదరాబాద్ పై కోల్కతా 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్ లో ముంబై చేతిలో ఓడిన కోల్కతా.. అల్ రౌండ్ ప్రదర్శనతో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొదటిగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 142 /4 కి పరిమితమైంది. ఇక 143 పరుగుల లక్యంతో బరిలోకి దిగిన కోల్కతా.. 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్యాన్ని చేధించింది.
ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శుబ్మన్ గిల్ (62 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మోర్గాన్ (29 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 70 బంతుల్లో 92 పరుగులు జోడించారు.
అంతకముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మనీశ్ పాండే (38 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ నమోదు చేయగా, డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (31 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.