ఫిల్మ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి, ‘చాణక్య’ మేకర్స్ కు బెదిరింపులు మొదలయ్యాయట. మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక బడా ప్రొడ్యూసర్ థియేటర్ల యాజమాన్యానికి హెచ్చరికలు పంపుతున్నారట. మీ థియేటర్లో గోపీచంద్ హీరోగా వస్తున్న ‘చాణక్య’ సినిమా వేయవద్దని అలా వేస్తే రాబోయే రోజులలో ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారట. అంటే ‘చాణక్య’ మేకర్స్ కు ఇన్ డైరెక్ట్ గా సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాలని ‘సైరా’ సినిమాకు అడ్డు రావద్దని కోరుతున్నారట.

అక్టోబర్ 2వ తేదీ అంటే బుధవారం ‘సైరా’ సినిమా విడుదల అవుతుండగా రెండు రోజుల గ్యాప్ ఇచ్చి అక్టోబర్ 5వ తేదీ శనివారం ‘చాణక్య’ సినిమా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. కానీ తెలుగులో బారి బడ్జెట్ సినిమాగా రానుండటంతో ‘సైరా’ సినిమాకు మరో సినిమా అడ్డు రాకూడదని యూనిట్ సభ్యులు బావిస్తుండవచ్చు. అందులో భాగంగానే ఈ బెదిరింపులు.

అంటే పండగ రోజులలో మీడియం బడ్జెట్ సినిమాలు విడుదల కావడానికి వీలు లేదా? అలా విడుదలైతే ఊరుకోరా ఇదెక్కడి న్యాయం అని సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘సైరా’ సినిమాపై అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ‘చాణక్య’ సినిమాను అడ్డుకోవాల్సిన పనేమిటి… ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. చాల రోజులుగా హిట్ లేక పరితపిస్తున్న గోపీచంద్ ‘చాణక్య’ సినిమాపై మంచి కాన్ఫిడెంట్ ఉండటంతోనే సినిమాను విడుదల చేసి దసరా సీజన్ లో సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.

దసరా పండుగ సమయంలో ఏ సినిమా విడుదల లేకపోతే ప్రేక్షకులంతా పండుగ సీజన్ లో చచ్చినట్టు బాగున్నా… బాగోకపోయినా ‘సైరా’ సినిమానే చూస్తారని అప్పుడు కలెక్షన్స్ వచ్చి అందరూ బయటపడతారని బావిస్తున్నారా? ఇలాంటి పోకడలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచివి కాదు. చిరంజీవి మార్కెట్ స్థాయిని బట్టి ‘సైరా’ సినిమా నిర్మిస్తే గోపీచంద్ మార్కెట్ స్థాయిలో ‘చాణక్య’ సినిమా నిర్మించారు. పెద్ద నిర్మాతలు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలే తప్ప పండగ పూట మరొక హీరోను రానివ్వం తొక్కేస్తాం అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకోకపోయినా సోషల్ మీడియాలో ప్రశ్నించి రచ్చ చేయడానికి నెటిజన్లు రెడీగా ఉన్నారు.

దాదాపుగా 10 రోజుల పాటు దసరా సేవలను ఎంజాయ్ చేసి, నాలుగు సినిమాలు విడుదలైతే నాలుగు సినిమాలకు కుటుంబం మొత్తం వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఒక్క ‘సైరా’ చూడాలని మిగతా సినిమాలు ఏవి పండుగ సీజన్లో విడుదల కావద్దని భావించడం మాత్రం చాల తప్పుడు నిర్ణయం. దీనిపై ఇంతవరకు రెండు చిత్రాలు యూనిట్ సభ్యులు స్పందించలేదు. ‘చాణక్య’ సినిమాపై ఈరోజు, రేపటితో క్లారిటీ రానుంది.