చాలా కాలం నుండి హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న క్రేజి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ‘ఇస్మార్ట్ శంకర్’ తో హిట్ వచ్చింది. పూరి మ్యాజిక్ తో రామ్ ఎనర్జీ కలవడంతో నిన్న విడుదలైన మొదటి షో నుండే ఈ సినిమా పాసిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సంబరాలలో మునిగిపోయారు. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ టీంతో రామ్ గోపాల్ వర్మ కూడా జాయిన్ అయ్యారు.

‘ఇస్మార్ట్ శంకర్’ టీం తో కలసి సంబరాలలో పాల్గొన్న వర్మ.. బీర్ బాటల్ తో రచ్చ రచ్చ చేశారు. బీరును పొంగించి పూరి జగన్నాథ్ మీద, ఛార్మి మీద, చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ మీద పోసి, తరవాత తన మీద పోసుకున్నారు. ఈ విధంగా తన శిష్యుడు సక్సెస్ ను సెలెబ్రేట్ చేస్తూ ఎంజాయ్ చేశారు. పూరి కూడా వర్మని కౌగలించుకుని కృతజ్ఞతలు తెలియజేశారు.

rgv
  •  
  •  
  •  
  •  
  •  
  •