ఎన్నో ఆశలు ఆకాంక్షలతో దాదాపుగా మూడు నెలల పాటు ప్రశాంతంగా తన ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించిన చంద్రయాన్ 2 చివరి దశలో చంద్రుని మీదకు దిగే రెండు కిలోమీటర్ల దూరంలో లాండింగ్ సమస్య వచ్చి బెంగళూరు లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోవడంతో విక్రమ్ ల్యాండర్ పరిస్థితి అప్పటి నుంచి ఆచూకీ దొరకకుండా పోయింది. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం నాసా శాస్త్రవేత్తలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసారు.

చంద్రయాన్ 2 గురించి ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ చంద్రయాన్ 2 కథ ముగియలేదని త్వరలో మరోసారి చంద్రయాన్ 2 ప్రయోగం చేసి చంద్రుని మీదకు ల్యాండర్ ను సాఫ్ట్ గా దించి తీరుతామని, చంద్రయాన్ 2 ద్వారా ఎంతో విలువైన సాంకేతిక అనుభవాన్ని సంపాదించామని ఢిల్లీ ఐఐటిలో జరిగిన స్నాతకోత్సవంలో అయన ఈ వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్ లో చంద్రయాన్ 2 ప్రయోగంతో భారత్ జెండా రెపరెపలాడిస్తామని చెప్పుకొచ్చారు.