ఈనెల 7వ తేదీన చంద్రుని మీదహ్కు ల్యాండ్ అవ్వవలసిన విక్రమ్ ల్యాండర్ 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఇస్రో గ్రౌండ్ స్టేషన్ కు సిగ్నల్స్ ఆగిపోవడంతో ‘చంద్రయాన్ 2’ ప్రయోగం పూర్తిగా ఫలించకుండానే ముగిసిందనుకుంటున్న సమయంలో విక్రమ్ ల్యాండర్ ను ఆర్బిటరీ గుర్తించడంతో పాటు విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీదకు దిగడం జరిగిందని ఒకవైపుకి ఒరిగిపోయి ఉన్నట్లు తెలుస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ తో సిగ్నల్ వ్యవస్థను రూపొందించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

అసలు విక్రమ్ ల్యాండర్ దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి చంద్రుని చుట్టూ 100 కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్న ఆర్బిటరీని 50 కిలోమీటర్లకు తగ్గించాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇస్రో మాజీలతో పాటు, అంతర్జాతీయంగా ఉన్న శాస్త్రవేత్తలు ప్రమాదంగా చెబుతున్నారు. 100 కిలోమీటర్ల నుంచి 50కు తగ్గిస్తే ఇంధనం ఖర్చు బాగా పెరిగిపోతుందని, ఆర్బిటరీ లైఫ్ తగ్గిపోతుందని వాదిస్తున్నారు.

ఇస్రో శాస్త్రవేత్తలు మాత్రం మరింత దగ్గరగా వెళ్లి విక్రమ్ ల్యాండర్ పరిస్థితిని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఇలాంటి పని చేయవలసి వస్తున్నట్లు తెలుపుతున్నారు. ఇక 50 కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి మరల 100 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకు వెళ్లాయి అంటే మరింత ఇంధనం వృధా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బిటరీ ఎంతో విలువైనదని, విక్రమ్ ల్యాండర్ కోసం చేస్తున్న ప్రయోగం రిస్క్ తో కూడుకున్నదని చెబుతున్నారు.

సెప్టెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ ను కనుగొన్న దగ్గర నుంచి ఎలాగైనా ల్యాండర్ ను పునరుద్ధరించాలని చేస్తున్న ప్రయత్నాలలో ముందు ల్యాండర్ పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పడం లేదని తెలుపుతున్నారు. కానీ అసలు దూరం తగ్గిస్తారా లేక దీనిపై పునరాలోచించి ఆర్బిటరీపై తీసుకునే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

‘చంద్రయాన్ 2’ లో ఆర్బిటరీ, విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ లను పంపించారు. విక్రమ్ ల్యాండర్ లో ప్రగ్యాన్ ఉండిపోయింది. చంద్రుని మీదకు సేఫ్ గా విక్రమ్ ల్యాండర్ దిగితే ప్రగ్యాన్ ల్యాండర్ లో నుంచి బయటకు వచ్చి తన పని మొదలు పెట్టవలసి ఉంది. ఇప్పుడు ప్రగ్యాన్ సేఫ్ గా ఉండ లేక ఏదైనా డ్యామేజ్ జరిగిందా అన్నది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా సున్నితంగా దిగవలసి ఉండగా కాస్త బలంగా చంద్రుని మీదకు దిగడంతో పాటు ఒక పక్కకు ఒరిగిపోవడంతో సిగ్నల్స్ అందటం లేదట. ఆర్బిటరీ బరువు 2379 కిలోలు కాగా విక్రమ్ ల్యాండర్ బరువు 1471, ప్రగ్యాన్ 27 కిలోల బరువు కలిగి ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  
  •  
  •