15 ఏళ్ళ యువతి చేసిన ఒక సాహసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియా హైలెట్ చేయడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా జ్యోతి కుమారి గురించే మాట్లాడుకుంటున్నారు. తన తండ్రికి గాయం కావడంతో లాక్ డౌన్ సమయంలో తమకు సరైన ఉపాధి లేకపోవడంతో గురుగ్రామ్ నుంచి తన తండ్రిని బీహార్ లోని తన ప్రాంతమైన దర్బారామ్ కు ఎనిమిది రోజుల పాటు 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసిన జ్యోతి కుమారి గురించి ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ మీడియాలు ఆరా తీయడం మొదలు పెట్టారు.

సైకిల్ పై ఒక 15 ఏళ్ళ యువతి తన గాయపడిన తండ్రిని ఎక్కించుకొని అంత దూరం తొక్కగలదా? ఇది నిజమేనా అంటూ చేస్తున్న ప్రయత్నాలలో అంతా నిజాలే కనపడుతున్నాయి తప్ప అబద్ధాలు ఎక్కడ కనపడటం లేదు. జ్యోతి కుమారి ఒక సంచలనం… ఎనిమిదవ తరగతి వరకు చదవుకున్న జ్యోతి కుమారి చేసిన సాహసం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంక ట్రంప్ కొనియాడుతున్నారు.

ఇలా 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయడమనేది ఒక అద్భుతమని, భారతీయ ప్రజలలో ఇంత ఓర్పు, సహనం, ప్రేమ ఉంటాయన్నది ఈమె ద్వారా తెలుస్తుందని ఇవాంక ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పుడు జ్యోతి చేసిన పనికి అందరూ మెచ్చుకోవడంతో పటు ఆమెను కావాల్సినంత వరకు చదవించడానికి చాలా మంది దాతలు సిద్ధంగా ఉన్నారు. తన తండ్రికి మెరుగైన వైద్యం కల్పించడంతో పాటు వారు ఉండటానికి తిండి, గూడు, గుడ్డ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారు. జ్యోతి కథ బయటకు వచ్చింది కాబట్టి ప్రపంచం మొత్తం సహాయం చేయడానికి సిద్ధమవుతుంది. ఇలాంటి వలస కూలీలు మన దేశంలో వేలల్లో ఉన్నారు. వారందరు సరైన ఆహారం లేక కాళ్లకు చెప్పులు లేకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వందల కిలోమీటర్లు సంకలో చంటి బిడ్డను వేసుకొని నడుస్తున్న వారి ఆవేదన పట్టించుకునే నాధుడెవరు?

15 ఏళ్ళ యువతి సైకిల్ పై తన తండ్రితో 1200 కిమీ ప్రయాణం, పెద్ద సాహసమే

ఏమిటి ఈ దిక్కుమాలిన నిర్ణయాలంటూ ట్రంప్ ను మీడియా కడిగిపారేస్తుంది

ఇప్పటికైనా గురూజీని వదిలేయండి సామి, ఇక మీదట అలా చేయడులే