కర్నూల్ ను న్యాయరాజధానిగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో సీఎం జగన్ ను కలసిన టీజీ వెంకటేష్ హైకోర్టు ఎంతవరకు వచ్చిందని జగన్ ను అడిగారు. దానికి జగన్ సమాధానమిస్తూ.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరామని.. నివేదిక కూడా పంపించామని.. సీఎం జగన్ వివరించారు.

రాయలసీమ డిక్లరేషన్ లో బీజేపీ మేనిఫెస్టోలో హైకోర్టు అంశం ఉండడంతో కేంద్రం నుండి త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చని సీఎం జగన్ తో ఎంపీ టీజీ పేర్కొన్నారు. ఇక కర్నూలులోని దిన్నెదేవరపాడులో ఇక పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •