ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లను కైవసం చేసుకొని ప్రతిపక్షమనేదే లేకుండా తుడిచి పెట్టేసినంత పని చేసింది. ఇక ఇందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ మాత్రం తన పాలనపై పట్టు పెంచుకుంటూనే ఎక్కడ అవినీతి జరగడానికి వీలు లేదన్నట్లు వ్యవహారం నడుపుతున్నారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఆదేశాలు జారీచేశారు. ఎక్కడా ఎలాంటి అవినీతికి చోటు లేకుండా పారదర్శకంగా పనిచేయాలని చెబుతుంటే, కొంత మంది మంత్రులు మాత్రం జగన్ మాటలు లెక్కచేయకుండా కౌంటర్ ఓపెన్ చేసినట్లు తెలుస్తుంది.

ఇప్పుడు ఉన్న 25 మంది మంత్రులలో దాదాపుగా నలుగురు మంత్రులు తప్ప అందరూ సీఎం జగన్ బాటలో నడవడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం జగన్ పదే పదే అవినీతి లేని పరిపాలన అందించాలని కోరడంతో మంత్రుల వ్యవహారం కూడా అలానే ఉంది. ఒక నలుగురు మంత్రులు మాత్రం ఎంత చెప్పిన వినడం లేదట. ఆ మంత్రులు అవినీతిరహిత పాలన దిశగా నడిచి పారదర్శకంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నా వారి కుటుంబ సభ్యులు కౌంటర్ లు ఓపెన్ చేసి దందా మొదలు పెట్టినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఇది నచ్చని జగన్ ఇప్పటికే ఒకరిద్దరకు గట్టి వర్కింగ్ కూడా ఇచ్చారట. ఇక వేళ పనితీరు ఇలాగే ఉంటే వచ్చే రెండు నెలలో ఆ నలుగురుని మంత్రి పదవుల నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నారట. 

వైఎస్ జగన్ పై గత తెలుగుదేశం ప్రభుత్వ సభ్యులు జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడని పదే పదే ఆరోపణలతో విరుచుకుపడేవారు. జగన్ మాత్రం నేను దోచానని చెబుతున్న లక్ష కోట్లు మీరే తీసుకొని ఒక పది పైసలు మాత్రం నాకు ఇవ్వండి అంటే నోరు మెదిపేవారు కాదు. లేని పోనీ ఆరోపణలతో జగన్ ను చంద్రబాబు నాయుడు అండ్ కో తప్పుడు ఆరోపణలు చేసి జగన్ ను ప్రజలలో చులకన చేయడానికి ఇంతా ప్రయత్నించాలో అంతా చేసేసారు. ఇలాంటి నిందలు పోగొట్టుకోవాలంటే ఏపీలో ఉన్న అధికారులతో పాటు, తన ప్రభుత్వలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర నుంచి అందరాని పారదర్శకంగా వ్యవహరించేలా చేసి ప్రజలకు చెప్పిన అన్ని పధకాలు మేలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటే చంద్రబాబు చేసిన ఆరోపణలు తిప్పి కొట్టి వచ్చే 2024 ఎన్నికలలో కూడా అధికారాన్ని చేపట్టవచ్చు అనేది ఆలోచన. కానీ కొంత మంది మంత్రుల చేష్టలతో అసలుకే ఇబ్బందులు వచ్చేలా ఉండటంతో చేసేదేమి లేక వారిని తప్పించి కొత్త వారికి ఇస్తే అధికారులతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలకు గట్టి వర్కింగ్ ఇచ్చినట్లు ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఇంతకు ఆ నలుగురు మంత్రులు ఎవరా అని అమరావతి చుట్టూ పక్కల ఒకటే గుసగుసలు ఆడుకుంటున్నారట. 


Tags: Ys jagan


  •  
  •  
  •  
  •  
  •  
  •