కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా విజృంభిస్తుంది. ఇప్పటికే 213 దేశాలకు కరోనా సోకడంతో తీవ్రంగా వణికిపోతున్నాయి. దీంతో ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. కాగా ఈ నేపథ్యంలో ఎంతో మంది ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు అందరికి ఇదే పరిస్థితి తలెత్తింది. ఇక జపాన్‌కు చెందిన ఫెన్సర్‌ రియో మియాక్‌ కు కూడా అదే పరిస్థితి వచ్చింది. అతను గతంలో 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో టీమ్‌ విభాగంలో రజత పతకం గెలిచాడు. అయితే ఇప్పుడు కరోనా వల్ల ఫుడ్ డెలివరీ బాయ్ గా చేరాడు. ఉబర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్ గా చేరి రోజుకు రెండు వేల యెన్ లు సంపాదిస్తున్నాడు. ఆర్ధికంగా నిలబడడంతో పాటు రాబోయే రోజుల్లో దృడంగా ఉండడానికి దీనిని ఎంచుకున్నానని చెబుతున్నాడు. ఫెన్సింగ్‌ అనేది ఓ మంచి క్రీడ అని దానికి బాగా పిట్ గా ఉండాలని చెబుతున్నాడు రియో మియాక్.

నాకు డబ్బుల కోసం మార్గం ఆలోచించగా ఉబర్‌ ఈట్స్‌ జాయిన్ అయ్యే ఐడియా వచ్చిందని అందువల్ల జాయిన్ అయ్యానన్నాడు. నా శరీర దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఇదొక ఎక్సర్‌సైజ్‌లా ఉందని.. ఎక్కడైతే కరోనా వైరస్ రిస్క్ తక్కువుగా ఉందొ అక్కడే డెలివరీ చేస్తున్నాను అన్నాడు. ఇక తమ దేశంలో రాబోయే ఒలింపిక్స్ కూడా సిద్ధంగా ఉన్నానన్నాడు రియో మియాక్.

మహారాష్ట్రలో 1061 మంది పోలీసులకు కరోనా సోకడంతో తీవ్ర కలకలం

కరోనా వైర‌స్‌ను పసిగట్టే మాస్కులు