సంగీత ప్రియులను శోకసముద్రంలో పడేసి అనంతలోకాలకు వెళ్లిపోయిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సంగీతం కళలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకు గాను ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని సీఎం జగన్ లేఖలో కోరారు.

ఇక గతంలో సంగీత దిగ్గజాలు లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీంసేన్ జోషి వంటివారికి సైతం భారతరత్న ఇచ్చిన విషయం సీఎం జగన్ ఈ లేఖలో ప్రస్తావించారు. బాలు గారు ఏపీలో జన్మించడం రాష్ట్రం చేసుకున్న అదృష్టమని.. ఆయన అకాల మరణం ఎంతో మంది అభిమానులను, సంగీత ప్రియులను కలచి వేసిందని సీఎం అన్నారు. సంగీత ప్రపంచానికి ఆయన 50 ఏళ్ల పాటు సేవలందించారని లేఖలో ప్రస్తావించారు వైఎస్ జగన్.