చిరంజీవి లాక్ డౌన్ మొదలైన దగ్గర నుంచి సినీ కార్మికులను ఆదుకోవడంలో ముందు వరుసలో ఉంటున్నారు. సినీ కార్మికులను ఆదుకోవడానికి ఒక సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా సహాయం చేస్తున్నారు. దీనిలో చిరంజీవిని పొగిడేవారు భజన కొట్టేవారు ప్రతి రోజు ఎంతోమంది. రెండు రోజుల క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు నిత్యావసరాలు పంపిణి చేసే సంచులపై చిరంజీవి ఫోటోల ముద్రించి ఉండటంపై అనేక విమర్శలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇలా భజన కొట్టుకోకుండా సామజిక సేవ చేసే వారు ఈరోజులలో కరువయ్యారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరొకవైపున హీరో కమ్ విలన్ జగపతి బాబు గత రెండు నెలలుగా లైమ్ లైట్ లోకి రాకుండా తనకు తోచిన సహాయం చేస్తూ పేద ప్రజలను ఆదుకుంటున్నారని తెలుస్తుంది. ఈమధ్య పదివేల మంది వలస కార్మికులను ఆదుకునేదానిలో భాగంగా బియ్యం, పప్పులు, వంట నూనె అందించినట్లు తెలుస్తుంది. దీనిపై ఒక మీడియా జగపతి బాబుని అడగగా మనం చేసే సహాయం పది మందికి తెలియాల్సిన అవసరం లేదని, వారి కడుపులు నిండితే అదే చాలని వ్యాఖ్యానించారు.

జగపతిబాబు పీపుల్స్ ఫౌండేషన్ అనే సామజిక సంస్థతో కలసి తన సేవలు అందిస్తున్నారు. వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేర్చడం దగ్గర నుంచి అన్ని పనులు ఆ సేవ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నారట. ఇప్పుడు జగపతి బాబు ఎలాంటి ప్రచారం లేకుండా అందిస్తున్న సేవలు అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇచ్చేది తక్కువ… ప్రచారం ఎక్కువ అనే రీతిలో హడావిడి చేసి, పేరు కోసం పాకులాడుతున్నారు తప్ప నిజాయితీగా సేవ కార్యక్రమాలు చేయడం లేదని గత రెండు నెలలుగా చూస్తే అర్ధమవుతుంది.

గణపతి శాస్త్రి చేసిన యాగం, సంజయ్ గాంధీ మరణానికి దారి తీసిందా?

కోర్టు తీర్పులపై సీఎం జగన్ అసహనానికి గురవుతున్నారా?