మొదటిసారి ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నరోజులలో జగన్ పార్టీని దెబ్బ తీయడానికి చంద్రబాబు నాయుడు దాదాపుగా 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపిలను తన పార్టీలోకి లాక్కొని వైసీపీ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చాలని చూస్తే 2019 ఎన్నికలలో 23 ఎమ్మెల్యేలు, మూడు ఎంపీ స్థానాలు మాత్రమే టీడీపీ పార్టీకి మిగిలాయి. ఇప్పుడు జగన్ సర్కార్ కూడా టీడీపీ పార్టీని తునాతునకలు చేయడానికి నలుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చేసుకుంది.

పార్టీలో అయితే చేర్చుకున్నారుగాని వారితో వైసీపీ క్యాడర్ కు ఏ మాత్రం పొసగడం లేదు. చీరాలలో ఆమంచి, కారణం బలరాం వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పుల యుద్ధం జరుగుతుంది. ఏదైనా కార్యక్రమం మొదలయ్యే సమయంలో బాహాబాహీకి దిగడం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి గన్నవరం నియోజకవర్గంలో కూడా నెలకొని ఉంది. వల్లభనేని వంశీ గత పదేళ్లుగా వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను ఇప్పుడు వైసీపీలోకి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తూ కొరకరాని కొయ్యగా మారిపోయాడు. వైసీపీ పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుల వర్గాలతో ఎప్పటికప్పుడు గొడవలకు దిగుతూ ఈమధ్య సచివాలయ శంకుస్థాపన సమయంలో నేరుగా బాహాబాహీకి దిగారు.

ఇదంతా ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. నిన్న విద్యాకానుక ప్రారంభ ప్రోగ్రాంలో సీఎం జగన్ అందరకి షాక్ ఇస్తూ యార్లగడ్డ వెంకటరావు, వల్లభనేని వంశి చేతులు కలిపి ఇద్దరు కలసి పనిచేసుకోండని చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ కు గురయ్యారు. ఈ గొడవల విషయంలో వైసీపీ అధిష్టానం ఎలా ముందుకు పోతుందో తెలియక అందరూ అయ్యోమయ్యంలో ఉన్నసమయంలో ఇలా ఇద్దరు చేతులు కలిపి జాగ్రత్తగా నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి చేసుకోమని చెప్పడంతో ఇప్పుడు యార్లగడ్డ వర్గము షాక్ లో ఉంది. కానీ ఇప్పటికి కూడా కలిసి ముందుకు వెళ్లకుండా ఇంకా గొడవలు చేసుకుంటే ముందుకు వెళ్తామంటే ఏదో ఒక నేతను సస్పెండ్ చేయడం కన్నా మరొక దారి లేదు. అది ఎవరు అనేది కాలమే నిర్ణయించాలి. కానీ గన్నవరంలో మాత్రం వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదనలో అయితే ఉన్నారు. వల్లభనేని వంశి అరాచకాలు తమకు భరించలేకుండా ఉన్నామని, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తమ సత్తా చూపించి అతడిని ఓడగొట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెబుతున్నారట.