రెండు రోజుల క్రితం జహీర్ ఖాన్ పుట్టిన రోజు సందర్బంగా హార్దిక్ పాండ్య జన్మదిన శుభకాంక్షలు చెబుతూ, జహీర్ ఖాన్ బౌలింగ్ లో తాను కొట్టిన సూపర్ ఫోర్ ను వీడియోగా పెట్టాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు హార్దిక్ పై చేసారు. నీకు ఇంకా పొగరు తగ్గలేదని, ఒక సీనియర్ ఆటగాడికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నీకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై ఇప్పుడు జహీర్ ఖాన్ ఘాటుగా స్పందించాడు.

హార్దిక్ పాండ్యను ఉద్దేశించి మొదటిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు నీకు ధన్యవాదాలు… నీలా నేను బ్యాటింగ్ చేయలేను, అయితే ఇదే మ్యాచ్ తరువాత బాల్ వలే నేను నా పుట్టినరోజు చాలా బాగా జరుపుకున్నాను అని అన్నాడు. హార్దిక్ పాండ్య ఫోర్ కొట్టిన తరువాత బాల్ కు జహీర్ బౌలింగ్ లో అవుట్ అవ్వడం జరిగింది. తనకు పుట్టిన రోజు శుభకాంక్షలు పెట్టిన అందరికి ధన్యవాదాలని జహీర్ ఖాన్ అన్నాడు.

దీనితో హార్దిక్ పాండ్యకు సరైన స్ట్రోక్ జహీర్ ఖాన్ ఇచ్చాడని నెటిజన్లు మరోసారి హార్దిక్ పై విరుచుకుపడుతున్నారు. హార్దిక్ పాండ్య స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు వెన్ను నొప్పి కారణంగా దూరమయ్యాడు. ప్రస్తుతం లండన్ లో తన వెన్ను నొప్పికి సంబంధించి శస్త్రచికిత్స జరగడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. తాను తిన్నగా సీనియర్ ఆటగాడికి బర్త్ డే విషెష్ చెప్పకపోగా, ఇలాంటి తింగిరి వేషాలు వేస్తూ పోస్టులు పెట్టడంతో నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు.