ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉన్న క్రేజ్ తెలిసిందే. జేమ్స్ బాండ్ చిత్రాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా బాండ్ సిరీస్ లో వస్తున్న 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ బాండ్ పాత్రలో డేనియల్ క్రేగ్ నటించారు.

క్యారీ జోజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఇక ఈ మూవీ నవంబర్ లో విడుదల కానుంది. ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.