ఆర్టికల్ 370తో ఇక జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా భూములు కొనుకోవచ్చు, అలానే అమ్ముకునే హక్కు కూడా ఉంది. దీనితో ఎంచక్కా కాశ్మీర్ లో తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేయవచ్చని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వెల్లువలా పుట్టుకొస్తున్నాయి. కానీ కాశ్మీర్ లో ఒక పెద్ద భూతాల స్వర్గంలో ధరలు మాత్రం భారీగానే ఉన్నాయి. వ్యవసాయ నివాసయోగ్యమైన భూములు తక్కవ రేట్లలో లభ్యమవుతున్నా, ధరలు మాత్రం మెట్రో నగరాలకు తీసిపోని విధంగా ఉన్నాయి.

అయినా ఒకవేళ ప్రకృతి అందాలు వీక్షించడంతో పాటు, నీటి వసతికి ఇబ్బంది లేకుండా పుష్కళంగా ఉండటంతో ఎంతకైనా కొందామని ప్రయత్నించినా భూరికార్డ్స్ మాత్రం సరిగ్గా లేవని తెలుస్తుంది. ఇక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పూర్తిగా కేంద్ర పరిధిలోకి రానుండటంతో, భూరికార్డ్స్ వంటి వాటిపై కూడా ద్రుష్టి పెట్టి అక్కడ క్రయ విక్రయాలు పెంచేలా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. భూమికి సంబంధించిన విషయాలన్నీ స్థానికంగా ఎన్నికయ్యే ప్రభుత్వమే చూడనుందని తెలుస్తుంది.

ఇక జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు కూడా ఇక నుంచి మొత్తం కేంద్రం పరిధిలోకే రానున్నారు. నూతన కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లలో శాంతి భద్రతలన్నీ పోలీస్ వ్యవహారాలు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రమే పర్యవేక్షించనుంది. అటు లడక్ లో కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉండే పరిస్థితులే ఉండనున్నాయి. 144 సెక్షన్ ఆంక్షలు ఎత్తివేయడంతో స్కూల్స్, ఆఫీసులు తెరుచుకోవడంతో జనజీవనం మొత్తం సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •