ఏపీలో రాజకీయసమీకరణాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికలలో వామపక్షాలు జనసేనతో కలిసి పోటీ చేస్తాయని సిపిఎం కార్యదర్శి పి.మదు చెప్పారు. విశాఖలోని సిపిఎం ఆఫీసులో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ, వామపక్ష పార్టీల కూటమి ఏపీలో రాజకీయంగా ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయడానికి వచ్చారన్న మధు.. తమ కూటమి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అన్నారు. ఓవైపు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోగా, మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచాయని గుర్తుచేవారు.

జనవరి 18, 19, 20 తేదీల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేయాలన్నదానిపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. అదే విధంగా ఇటీవలి ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పారు. ఆ నేపద్యంలోనే బీజేపీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందని అన్నారు. అలాగే కేంద్రలో కూటమి వల్ల కానీ పేదరాలీ ప్రెంట్ వల్ల కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని మధు అన్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •