తూర్పు గోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో ఎమ్మెల్యే తో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం పేకాడుతున్న కొంత మంది స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి మద్దతుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన రాపాక.. వారి అనుచరులతో కలసి ఎస్సై పై గొడవకు దిగారు. పోలీస్ స్టేషన్ పైకి రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు. కావున చట్ట ప్రకారం పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కాగా రాపాకను పోలీసులు కోర్టులో హాజర పరచనున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే రాపాక ఏ1 గా ఉన్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •