మెగాస్టార్ చిరంజీవి అతని సతీమణి సురేఖ కుటుంబసమేతంగా నిన్న తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సీఎం జగన్ ఇంట్లోనే చాల సేపు ఉండి కుశల ప్రశ్నలు వేసుకొని లంచ్ కూడా అక్కడే చేసి వచ్చారు. ఇక మీటింగ్ అంతా ఎంతో ఆహ్లాదంగా జరిగిందని, చిరంజీవి మరిన్ని మంచి పాత్రలతో మరిచిపోలేని అనుభూతులను పంచాలని సీఎం జగన్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇక చిరంజీవి కూడా స్పందిస్తూ సీఎం జగన్ ఇంటికి వెళ్ళినప్పుడు తన సొంత ఇంటికి వచ్చినంత ఆనందం కలిగిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

దీనిపట్ల కొంతమంది జనసేన అభిమానులు అసంతృత్తి వ్యక్తం చేస్తూ #RIPChiranjeevi పోస్టులు పెట్టడంతో కలకలం రేగింది. ఇలాంటి సంఘటన చూడటానికి పవన్ అన్న మనం బతికి ఉంది. పవన్ అన్న సచ్చిపోదాంరా నువ్వు నేను మన జనసైనికులం అంటూ పోస్ట్ చేసి కలకలం సృష్టిస్తున్నారు. ఇలా అనవసరంగా నోటు పారేసుకోవడం వలనే పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో దారుణంగా ఓటమి చెందాడని చిరంజీవిని అభిమానించే నెటిజన్లు జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలపై ఫైర్ అవుతున్నారు.

ఒక రాష్ట్ర సీఎంను కలసి మొదటి స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాద ఆధారంగా చేసుకొని తీసిన “సైరా”కు మొదటి వారం అదనపు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో కృతజ్ఞతలు చెప్పడంతో పాటు “సైరా” సినిమాను కుటుంబసమేతంగా చూడాలని నేరుగా సీఎంను కలసి కోరడానికి వెళితే ఇలా తప్పుడు ప్రచారాలతో నేరుగా చిరంజీవిని #RipChiranjeevi అని పెడుతున్నారంటే… సోషల్ మీడియాలో నెటిజన్లు చిరంజీవి వలన పవన్ కళ్యాణ్ ఎదిగాడా… లేక పవన్ కళ్యాణ్ వలన చిరంజీవి ఎదిగాడా అని చిరంజీవిని అభిమానించే వారు ఫైర్ అవుతున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా కొంతమంది జనసేన కార్యకర్తలు చేసిన అతితో పాటు మమల్ని ఎవడు ఏమి చేస్తాడులే అని జగన్ కుటుంబంపై తప్పుడు కథనాలు వండి వార్చడంతోనే ఇలాంటి దుస్థితి పట్టింది. అందుకే ఒక్క సీటుతోనే వారు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనసేన పార్టీకి నిజమైన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ లో కష్టపడేవారు ముందు నుంచి చెబుతూనే ఉంటారు. దయచేసి సోషల్ మీడియాలో మీరు పెట్టే తప్పుడు పోస్టుల వలన పవన్ కళ్యాణ్ కే తీవ్ర నష్టం జరుగుతుందని ఎంత చెబుతున్న కొంతమంది పిల్లలు తెలిసి తెలియక చేసే పోస్టులతో చాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. దీనిపై పవన్ కళ్యాణ్ వారి కార్యకర్తలపై చర్యలు తీసుకోక పోతే తీవ్ర నష్టం జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

  •  
  •  
  •  
  •  
  •  
  •