జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, ఆ పార్టీ కార్యకర్తలు కర్ణాటక తరహా ఫలితాలతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తాడని ఎన్నో అసలు పెట్టుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు తరువాత ముఖ్యమంత్రి పీఠం సంగతి తరువాత దాదాపుగా పోటీ చేసిన సగం పైగా నియోజకవర్గాలలో డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీనితో జనసేన పార్టీ వైపు కనెత్తి చూసే నాయకుడే కరువయ్యాడు.

గత వారం గోదావరి జిల్లాలకు చెందిన కాపు నాయకులందరూ కాకినాడ రైల్వే స్టేషన్ పక్కన ఒక హోటల్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ చేశారన్న సంగతి అందరకి తెలిసిన విషయమే. ఆ వేదికలో పలువురు బీజేపీలోకి వెళదామని మాట్లాడుకున్నారు తప్ప జనసేన పార్టీ పేరు ఎత్తే సాహసం చేయలేదని తెలుస్తుంది. కారణం పవన్ కళ్యాణ్ వైఖరితో పాటు, ఎన్నికలలో ఏదో సాధిస్తాడని ఊహించుకుంటే నామ మాత్రపు ఓట్లకే పరిమితమవడంతో భవిష్యత్ లేదని ఒక అంచనాకు వచ్చారు.

ఇక నిన్నటికి నిన్న బోండా ఉమ మాట్లాడుతూ తాను జనసేనలోకి వెళ్తానని అనుకోవడం పచ్చి అబద్ధమని, తానే కాదని నా కారు డ్రైవర్ కూడా జనసేన పార్టీలోకి వెళ్ళడని బోండా ఉమా చెప్పడంతో మరీ జనసేన పార్టీ అంత చీప్ గా ఎందుకు పనికిరాని పార్టీగా బోండా ఉమా లెక్కలేసుకున్నారా అనిపిస్తుంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బోండా ఉమా కొడుకు జనసేన బాధ్యతలు విజయవాడ ప్రాంతంలో తన బుజాల మీద వేసుకొని ర్యాలీల పేరుతో హల చల్ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బోండా ఉమా కూడా జనసేనలోకి వెళ్తే తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందని ఆలోచన చేసాడు. కానీ ఎన్నికలైపోయాక జనసేన పార్టీ మరీ తీసికట్టుగా ఉండటంతో కూరలో కరివేపాకు వలే తీసివేసి మాట్లాడటంతో జనసేన కార్యకర్తలు బోండా ఉమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా ఒక్కసారి ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటకపోతే ఆ పార్టీ వైపు కనెత్తి చూసే పరిస్థితి ప్రస్తుత రాజకీయలలో లేవనే చెప్పాలి.
  •  
  •  
  •  
  •  
  •  
  •