పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 2014 ఎన్నికల ముందు హైదరాబాద్ నగరంలో మాదాపూర్ లోని నోవెటల్ హోటల్ సాక్షిగా జనసేన పార్టీ ఆవిర్బావించింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తరువాత రెండు, మూడు సంవత్సరాల తరువాత ఏర్పడిన పార్టీపై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, కాపు నేతలు చాల ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ ఎన్నికలలో అయినా జనసేన పార్టీ అధికారాన్ని కైవసం చేసుకునేలా కష్టపడాలని ఎన్నెనో ప్రతిజ్ఞలు చేసుకున్నారు జనసేన పార్టీని నమ్ముకున్న యువత.

కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేయడం లేదని, కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు చేతిలో పెడదామని చెప్పి ఆ ఎన్నికలలో తన పూర్తి సహకారం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడనుకున్న జగన్ అభిమానులకు పవన్ ఇచ్చిన షాక్ తో గోదావరి జిల్లాలో ఉన్న కాపు ప్రజలంతా పవన్ కళ్యాణ్ కు అండగా ఉండే ఉద్దేశంతో, తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేసి క్నాద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించారు.

ఎన్నికల అనంతరం నాలుగు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతోనే ఉండి, గత మార్చిలో చంద్రబాబు మీద చేసిన విమర్శలతో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి దూరం జరిగి వచ్చే ఎన్నికలలో పోటీకి సాయి అంటుందని తెలియచేసారు. తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న అన్ని రోజులు పవన్ కళ్యాణ్ గురించి ఆహా ఓహో అన్న తెలుగుదేశం సభ్యులు… విడిపోయిన తరువాత వారి వక్రబుద్ధిని చూపెట్టి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఇలా నేరుగా పవన్ పై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు.

దీనిని గమనించిన పవన్ తెలుగుదేశం పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలను బయట పెట్టాలన్న ఉద్దేశంతో, ఎన్నికల ముందు తాను 60 నుంచి 70 స్థానాలలో పోటీ చేయాలనుకుంటున్నానని చంద్రబాబుకి చెబితే, అలా పోటీ చేస్తే ఓట్లు చీలి వైఎస్ జగన్ కు లబ్ది చేకూరుతుందని, ఈ ఎన్నికలలో నువ్వు పోటీ చేయకుండా నాకు సపోర్ట్ చేయాలనీ అడిగాడని, అలా సపోర్ట్ చేసినందుకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేసాడని పవన్ కళ్యాణ్ అప్పుడు జరిగిన ఒప్పందాలను బయట పెట్టి చంద్రబాబుని కంగుతినిపించాడు.

ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ని సంవత్సర ప్రయాణం తరువాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ తన పార్టీని రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసుకుంది. దీనితో పాటు రాష్ట్ర సమన్వయకర్తలను, ఇతర కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చైర్మన్ గా, మాదాసు గంగాధర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. జనసేన అధికార ప్రతినిధిగా మాజీ సమాచార కమిషనర్ విజయ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడిగా చిదంబరం నియమితులయ్యారు. దీనితో పాటు జిల్లాల స్థాయిలో వ్యవహారాలు చూసుకునేందుకు 15 మంది సమన్వయకర్తలను నియమించారు. వీరికి పార్ధసారధి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఇన్ని రోజుల తరువాత పార్టీకి ఒక రూపు తేవడానికి ప్రయత్నిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పట్ల జనసేన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags : Pawan Kalyan, Janasena, Pawan Kalyan Comments on Chandrababu Naidu, Telugudesam Party, Janasena Leader Pawan kalyan