గత ఐదు రోజులుగా పవన్ కళ్యాణ్ విశాఖ నగరంలో భవన నిర్మాణ కార్మికుల కోసం చేపట్టిన లాంగ్ మార్చ్ నుంచి వైసీపీ – జనసేన పార్టీ సభ్యులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ వైసీపీ సభ్యులను మీది ఒక బతుకేనా మీ 151 ఎమ్మెల్యేల బతుకెంత అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై మంత్రి కన్నబాబుతో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, బొత్స తీవ్రంగా పవన్ కళ్యాణ్ ఆరోపణలపై తిప్పికొట్టారు.

ఇక దీనికి సంబంధించి ఈరోజు జనసేన అధికారిక ట్విట్టర్ లో స్పందిస్తూ “పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఒక్కడంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా వాటికి సరైన సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వారి మెదడు ఇంతేనేమో అని జాలిపడాల్సిందే” అంటూ మరొక ట్వీట్ పెట్టారు. ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను ఒక్కడినే వస్తానని వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలను రమ్మని చెబుతున్నానని, వారందరకీ నేను సమాధానం చెబుతానని అంటున్నాడు.

పవన్ కళ్యాణ్ ఎంత సేపటికి ఇలా ఆవేశంగా మాట్లాడటమే తప్ప ఆలోచనతో మాట్లాడిన రోజే లేదు. సరే నువ్వే సవాలు విసిరావు కదా ఎక్కడకి రావాలో నువ్వే ఫిక్స్ చేయి అంటే మాత్రం ఆరోపణల వరకే పరిమితమవుతారు తప్ప.. దానిని ఆచరణలో పెట్టే పరిస్థితి మాత్రం చేయడు. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రబుత్వంపై ఆరోపణలు చేసి తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చే పనిలోనే ఉంటూ నిజంగా చంద్రబాబు నాయుడు దత్త పుత్రుడు అనిపించుకుంటున్నాడని వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •