అన్ని పార్టీల కార్యకర్తలు ఒకలా వ్యవహరిస్తే జనసేన పార్టీ సభ్యుల వ్యవహారం మాత్రం అందుకు బిన్నంగా ఉంటుంది. అందులో భాగంగా చాల మంది తమకు నచ్చని నేతల పట్ల పైశాచికంగా వ్యవహరిస్తూ అత్యంత క్రూరంగా నీచ పదజాలంతో విరుచుకుపడతారు. ఇంకా దారుణంగా జనసేన పార్టీకి ఉన్న పైడ్ ఆర్టిస్టులతో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తారు. అప్పట్లో వైఎస్ షర్మిల విషయంలో వారు వ్యవహరించిన తీరుతో నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు ఒక ఆడ కూతురు మీద చేయవద్దని విజ్ఞప్తి చేయవలసి వచ్చింది.

జనసేనకు చెందిన శతగ్ని టీమ్ ఇలా వ్యవహరించడంలో ముందు వరుసలో ఉంటుంది. ఒకొక్కరు వందల ఖాతాలు క్రియేట్ చేసి వారు చేసే రాదాంతంతో విసుగు చెంది ట్విట్టర్ నుంచి దాదాపుగా 400 మంది జనసేన కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలను నిలిపివేసింది. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు ఎలాపడితే అలా పోస్టులు పెడతాను అంటే ట్విట్టర్ కు కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా వ్యవహరించడంతోనే ఇప్పుడు ట్విట్టర్ ఖాతాలను తొలగించినట్లు తెలుస్తుంది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి జనసేన ట్విట్టర్ ఖాతాలను ఎందుకు నిలిపివేసారో అర్ధం కావడంలేదని వ్యాఖ్యానాలు చేయడం చూస్తుంటే జనసేన పార్టీకి చెందిన ప్రముఖమైన ట్విట్టర్ ఖాతాలు నిలిపివేయడంతోనే బయటకు వచ్చి ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు… జనసేన కార్యకర్తల అత్యుత్సాహం వలన ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో… ఇలా ఎన్నిసార్లు చెప్పినా వారు వినకుండా సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఝలక్ అని చెప్పుకోవచ్చు