నిజమే నిజమే… అదేమిటిరా బాబు మన అన్న రెండు లక్షల పుస్తకాలు చదవాడు… ఎంత జ్ఞానం సంపాదించాలి… అన్ని పుస్తకాలు చదవడం వలన మెదడులో ఉండవలసిన జ్ఞానం అరికలుకు చేరిందా ఏమిటి. అసలు పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నాడురా బాబు… ఎందుకురా అతడికి రాజకీయాలు… ఎంచక్కా సినిమాలు చేసుకుంటూ ఎంజాయ్ చేయక… ఊర్లలో మన పరువు తీస్తాడేరా బాబు ఇలా ఉన్నాయి రచ్చబండల వద్ద చర్చోపచర్చలు.

పదేళ్లలో ఎప్పుడు రానటువంటి వరదలొస్తే… జగన్ చేసిన నిర్వాకం వలనే ఇసుక దొరకడం లేదంటాడు

మద్యం దుకాణాలను 20 శాతం జగన్ సర్కార్ తగ్గిస్తే జగన్ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయి… రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నాడంటాడు.

2017లో ఒక చిన్నారిని రెసిడెన్షియల్ స్కూల్ లో అత్యాచారం చేసి కొంతమంది దుర్మార్గులు చంపేస్తే జగన్ సర్కార్ కేసు ఓపెన్ చేయకుండా ఏమి చేస్తున్నారు అంటాడు.

తెలంగాణాలో దిశ అనే అమ్మాయిని నలుగురు దుర్మార్గులు అత్యాచారం చేసి చంపేస్తే ఆడపిల్లలను కాపాడలేని జగన్ రెడ్డికి 151 సీట్లు ఎందుకని అంటాడు.

తన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవుతారు… పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అంటాడు.

రాయలసీమలో కరువు సృష్టించారు అంటారు… కరువు సృష్టించడానికి అదేమైనా….?

తనకు అన్ని మతాలు ఒకటే అంటాడు.. జగన్ రెడ్డి క్రిస్టియన్ మతం మారిన తరువాత రెడ్డి అనేది ఎందుకు తొలగించలేదంటాడు.

హిందువులే మత పిచ్చితో రాజకీయాలు చేస్తూ అన్యమతాన్ని తిరుమలలో ప్రోత్సహిస్తున్నారంటాడు.

ఆడపిల్లల అఘాయిత్యానికి మాతృభాషనే నిర్లక్ష్యం అంటాడు.

పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిలో జస్ట్ శాంపిల్ మాత్రమే ఇలా ఉంటే… అతడి పరిపక్వత అతడు వేసే వేషాలు… అసలు జనసైనికులే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లను కొంత జాగ్రత్తగా సరిచేసుకొని మాట్లాడాలని అంటున్నారంటే… వారికే పవన్ కళ్యాణ్ దెబ్బ ఎంతలా తగిలిందో అర్ధమవుతుంది.

అసలు పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు సీఎం కాకపోవడంతో పాటు తాను రెండు చోట్ల దారుణంగా ఓడిపోవడం జీర్ణించుకోలేక తడబాటుతో గతి తప్పి మతి లేకుండా మాట్లాడే మాటలను చూసి పవన్ కళ్యాణ్ అసలు తన మైండ్ సక్రమంగా పని చేస్తుందా ఏదైనా అనారోగ్యంతో బాధ పడుతున్నాడా అన్నదైతే కచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చి తీరుతుంది.

అతడి తీరు పట్ల జనసేన పార్టీలో ప్రస్తుతానికి ఒకరిద్దరు పేరున్న నాయకులు తప్ప ఎవరు మిగలలేదు. అసలు ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పట్ల కూడా చిన్న చూపు చూస్తుండటంతో రాపాక అనుచరవర్గం కూడా అతడి నుంచి పక్కకు జరిగి వేరొక పార్టీలలో చేరిపోయారట. అసలు పవన్ కళ్యాణ్ కు సలహాలిచ్చేవారు ఉన్నారా? అతడి ట్విట్టర్ అకౌంట్ కూడా తెలుగుదేశం పార్టీ నేతల చేతిలో బందీగా ఉన్నదని ఈమధ్యే నిరూపితమైంది. చిరంజీవి అయినా కాస్త కూర్చోపెట్టి చెప్పకపోతే పవన్ కళ్యాణ్ ను రాబోయే రోజులలో కేఏ పాల్ తో పోల్చడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.