ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆమెకు వైసీపీ అధినేత జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్ ఆదేశిస్తే ఏపీలో ఎక్కడ నుంచయినా పోటీ చేస్తామని ప్రకటించారు జయసుధ. తనకు సినిమా తప్ప ఎలాంటి వ్యాపారాలు లేవన్న ఆమె.. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు.

టీడీపీలో జాయిన్ అయ్యాను కానీ నేనేం చేయాలి నా విధులేమిటో ఎవ్వరు చెప్పలేదని.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పే వారని గుర్తు చేశారు. గతంలో సికింద్రాబాద్ సీటు ఇచ్చి వైఎస్ ప్రొత్సహించారన్నారు. గతంలో కాంగ్రెస్ తరుపున సికింద్రాబాద్ నుండి పోటీ చేసిన జయసుధ.. తలసాని శ్రీనివాస్ యాదవ్ పై విజయం సాధించారు. కాగా ఆమెకు వైసీపీ నుండి టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందంటున్నారు.

jayasudha