తాడిపత్రి నియోజకవర్గంలో 1985 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతు 2014 ఎన్నికలలో తన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆ స్థానంలో ఎమ్మెల్యేగా నిలబెట్టి, తాను అనంతపురం ఎంపీగా పోటీ చేసాడు. ఇక తాను ఎంపీగా గెలిచిన తరువాత తన పార్లమెంట్ కింద ఉన్న ప్రతి ఎమ్మెల్యేతో గొడవలు పెట్టుకుంటూ అంత నేను చెప్పిందే వేదం అనేలా ప్రవర్తించడంతో ఈ మధ్య తన పార్లమెంట్ స్థానం కింద ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అసహనానికిలోనై జేసీ దివాకర్ రెడ్డితో వేగలేకపోతున్నామని, వచ్చే ఎన్నికలలో జేసీ కనుక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే తాము కూడా గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబుకి తెలియచేశారట.

కొన్ని రోజుల క్రితం జేసీ దివాకర్ రెడ్డి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలసినప్పుడు వచ్చే ఎన్నికలలో తాము పోటీ చేయడం లేదని, అనంతపురం పార్లమెంట్ నుంచి నా కొడుకు పవన్ రెడ్డి, తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత రెడ్డి పోటీ చేస్తారని చంద్రబాబుకి చెప్పారట. దానికి చంద్రబాబు నాయుడు మీకు వచ్చే ఎన్నికలలో తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ ఒక్కటే ఇవ్వడం జరుగుతుంది. పార్లమెంట్ సీటు నుంచి మీరు గెలిచే పరిస్థితి లేదని చెప్పడంతో జేసీ దివాకర్ రెడ్డి తాను మాత్రమే తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలవగలనని చెప్పినప్పుడు, చంద్రబాబు నాయుడు కూడా గట్టిగానే మీ పార్లమెంట్ కింద ఉన్న కనీసం ఇద్దరు ఎమ్మెల్యేల సంతకాలు తీసుకురావాలని అప్పుడు మీకు సీటు ఇస్తానని, ఎమ్మెల్యేల సపోర్ట్ లేకుండా అసలు మీరు ఎలా గెలుస్తారని, మీ కుటుంబంలో ఎవరైనా పోటీ చేయండి నాకు ఇబ్బంది లేదని, కానీ వచ్చే ఎన్నికలలో మీకు ఒక్క సీటు మాత్రమే ఇస్తానని అది కూస తాడిపత్రి సీటు మాత్రమే అని తేల్చి చెప్పడంతో జేసీ కూడా మారు మాట్లాడకుండా తిరిగి వచ్చేశారట.

ఇక జేసీ దివాకర్ రెడ్డికి వైసిపిలోకి వెళ్లే ఛాన్స్ లేదా. ఒక వేళ జనసేన పార్టీలోకి వెళ్లి పోటీ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఒక వేళ ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా చూపించాలనుకుంటే గెలుస్తామన్న ధీమా లేదు. ఒక వైపున కొడుకు రాజకీయ భవిష్యత్ పై ఆందోళన, చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చే ఎన్నికలలో తన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేకపోయే, ఇంత గందరగోళం మధ్య నిన్న అనంతపురం జిల్లాలో జరిగిన ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు నాయుడుని ప్రసన్నం చేసుకోవడానికి తన నోటికి మరో సారి పని చెప్పి వైఎస్ జగన్ పై విమర్శలు చేసాడు. వైఎస్ జగన్ టికెట్స్ అమ్ముకుంటున్నాడని, హిందూపూర్ వైసిపి నేత నవీన్ నిచ్చెల్ ను 10 కోట్ల రూపాయలు డబ్బు అడిగాడని, తనకు ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడిన మాటలకు సభ వేదిక మీద ఉన్న జేసీ వ్యతిరేక వర్గ ఎమ్మెల్యేలు కూడా ముసి ముసి నవ్వుకున్నారు.

వచ్చే ఎన్నికలలో కొడుకు పవన్ కు పార్లమెంట్ సీటు ఇప్పించుకోవడానికి చంద్రబాబు ప్రసన్నం కోసం జేసీ దివాకర్ రెడ్డి పడుతున్న పాట్లు అన్ని, ఇన్ని కావు. మరో వైపు కొడుకు పవన్ కుమార్ రెడ్డి కూడా జేసీ దివాకర్ లాగే కొంత నోటి దురుసు ఉండటం కూడా అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలకు అసలు నచ్చడం లేదు. వైఎస్ జగన్ హిందూపూర్ వైసిపి నేతను డబ్బులడిగాడని చెబుతున్న జేసీ వచ్చే ఎన్నికలలో కొడుకుకి పార్లమెంట్ సీటు దక్కించుకోవడానికి ఎన్ని కోట్లు చంద్రబాబుకి సమర్పించుకోవడాన్ని రెడీగా ఉన్నాడో కూడా చెబితే బాగుండేదని అక్కడ జనం గుసగుస లాడుకుంటున్నారు.