ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తాజాగా ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జేడీ.. జగన్ కేసుల గురించి మాట్లాడారు. తానూ సిబిఐని వదిలేసి ఏడేళ్లు అవుతుందన్న జేడీ.. ఈ కేసుల గురించి పేపర్లలో, టీవిలో వస్తుంటాయి తాను కూడా అందరు లాగానే చూస్తుంటాను అన్నారు. అవి తానూ సిబిఐలో వచ్చిన కేసులని అప్పుడే హైకోర్టు, సుప్రీం కోర్టు వాళ్ళు ఇచ్చిన కేసులు 32 వరకు దర్యాప్తు చేయాల్సి వచ్చిందన్నారు. సీబీఐలో పనిచేసే సమయంలో డ్యూటీ చేయాలి కాబట్టి ఆ కేసుల్ని దర్యాప్తు చేశానన్నారు. ఆ తరువాత తాను ఆర్గనేజేషన్ లో లేనని అన్నారు. అసలు ఆ కేసుల్లో ఏ జరుగుతుందో తనకు తెలియదని.. ప్రస్తుతం కేసుల పరిస్థితిపై తనకు అవగాహన లేదన్నారు.

ఇక వైఎస్సార్ పార్టీలో చేరతారా అన్న ప్రశ్నపై స్పందించిన జేడీ.. ప్రజలని, సమాజాన్ని, దేశ ఆలోచన విధానాన్ని మార్చే రీతిలో ఏదైనా రాజకీయ పార్టీ ద్వారా సాధ్యం అనుకుంటే ఆ సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. రాజకీయాల్లో ఎవరి ఎజండా వారికి ఉంటుందని.. ప్రజాస్వామ్యంలో ఇదంతా బాగమన్నారు. ఇక తానూ జనసేన పరికి ఇంకా ముందే రాజీనామా చేయాల్సినదని చాలా లేట్ అయ్యిందన్నారు జేడీ లక్ష్మీనారాయణ.

కరోనా వైరస్ చికిత్సలో సరికొత్త విషయాన్ని కనుగొన్న షికాగో వైద్య నిపుణులు..!

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గర్భిణీ భార్యను కాల్చి చంపిన భర్త.. స్థానికంగా తీవ్ర కలకలం..!

వాట్సాప్ లో రాబోతున్న అద్భుతమైన ఫీచర్.. ఇక ఆ సంస్థలకు గట్టి పోటీ..!