జేడీ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అప్పట్లో సీఎం జగన్ కేసుల విషయంలో ఎంత అతిగా ప్రవర్తించాడో అందరికి తెలిసిన విషయమే. దీనిపై వైసీపీ కార్యకర్తలు నేరుగా జేడీపై ఎదురు దాడికి దిగిన సంగతులు కూడా ఉన్నాయి. ఇక అలాంటి జేడీ లక్ష్మీనారాయణ తరువాత రోజులలో జగన్ కేసులతో పాపులర్ అవ్వడంతో రాజకీయాలలోకి వచ్చి ఎంపీ అయిపోయి, ఢిల్లీ లెవెల్ లో చక్రం తిప్పాలని ఎన్నో కళలు కన్నాడు. తన కళలను జనసేన పార్టీ ద్వారా సాధించుకోవాలని అనుకోని జనసేన పార్టీ తరుపున విశాఖ పట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు.

మొదట్లో జేడీ లక్ష్మీనారాయణ గెలవబోతున్నాడని, ఎన్నో పుకార్లు షికార్లు చేసినా… జేడీ మాత్రం కనీసం పోటీ కూడా ఇవ్వలేక పోయాడు. ఇక జేడీ ఓడిపోయిన దగ్గర నుంచి జనసేన పార్టీ ఆఫీస్ చుట్టూ పక్కలకు కూడా వెళ్లలేదని తెలుస్తుంది. ఇక జేడీ ఇప్పుడు పార్టీ మారడానికి ప్రయత్నాలు ప్రారంబించాడట. జనసేన పార్టీలో తనకు అవమానం జరుగుతుందని పవన్ కళ్యాణ్ తనకు కూడా సరిగ్గా అప్పాయింట్మెంట్ ఇవ్వడం లేదని, తాను ఒక సామాన్య కార్యకర్తలా వెయిట్ చేయవలసి వస్తుందని ఆరోపిస్తున్నాడట.

ఇక మరోవైపున మరో వార్త కూడా హల్ చల్ చేస్తుంది. జేడీ జనసేన పార్టీలో ఉన్నా తాను ఏర్పాటు చేసిన సేవ సంస్థ నుంచి పార్టీ గుర్తు వాడకుండా సేవలు చేస్తూ జనసేన పార్టీ కార్యకర్తలను వాడుకుంటున్నాడని, ఇలాంటివి జనసేన పార్టీ పెద్దలకు నచ్చడం లేదని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ఇక ఇలాంటివి ఎన్నో వ్యాఖ్యలు జేడీ – పవన్ మధ్య గ్యాప్ ను మరింత పెంచాయని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య గ్యాప్ పెరగడంతోనే పవన్ కళ్యాణ్ ఈ మధ్య వేసిన కమిటీలలో జేడీకి స్థానం కల్పించలేదని తెలుస్తుంది. కానీ జనసేన కార్యకర్తలు మాత్రం జేడీ లాంటి నేత జనసేనలో ఉంటేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని… జేడీకి పార్టీలో ఇంకా ముఖ్యమైన పదవి ఇవ్వాలని అనుకోవడంతోనే కమిటీలో స్థానం కల్పించడం లేదని కవర్ చేసేలా మాట్లాడారు.

ఇప్పుడు గొడవలు చిలికి చిలికి గాలి వానలా మారడమే కాకుండా జేడీ ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లి… జనసేన పార్టీకి ఏపీలో భవిష్యత్ లేదని, వచ్చే ఐదు సంవత్సరాలు పార్టీని నడిపే పరిస్థితులలో కూడా పవన్ లేడని, బీజేపీలోకి వెళితే కాస్తయినా తనకున్న పలుకుబడితో ఏదో ఒకటి సాధించవచ్చని బావిస్తున్నారట. త్వరలో జేడీతో పాటు, తన అనుచరవర్గం మొత్తం బీజేపీలో చేరి జనసేన పార్టీకి పెద్ద జర్క్ ఇవ్వాలని చూస్తున్నారట.

  •  
  •  
  •  
  •  
  •  
  •