చైనాలో కమ్యూనిస్ట్ పాలనా అప్రతిహతంగా కొనసాగుతూ ఇతరదేశస్థుల మీదకు తన నిప్పుని రాజేస్తూ తానే ప్రపంచంలోకెల్లా అత్యంత పైస్థాయిలో ఉండాలన్న కుటిల ప్రయత్నాలలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నేతృత్వంలో కరోనా మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలేదని అనేక దేశాలు కోడైకూశాయి. కానీ చైనాలో ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎప్పటికప్పుడు జింగ్ పింగ్ వ్యవహారశైలిపట్ల నిరసన వ్యక్తం చేస్తున్నా పోలీసులను అడ్డుపెట్టుకొని తాను మరింత పైపైకి ఎదిగిపోతున్నాడు.

చైనాలో ఒక్కసాగారి అధ్యక్షుడుగా ఎన్నికైనవారు ఆ తరువాత అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయడానికి కుదరదు. కానీ చైనాలో మావో తరువాత 67 ఏళ్ళ జింగ్ పింగ్ అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగి రాజ్యాంగ సవరణ ద్వారా రెండవసారి అధ్యక్షుడుగా ఉండరాదన్న నిబంధనలకు తూట్లు పొడిచాడు. దీనితో రెండవసారి అధ్యక్షుడుగా 2022 వరకు కొనసాగనున్న జింగ్ పింగ్ ఇప్పుడు విజన్ 2035 పేరుతో మరొక 15 ఏళ్ళ పాటు పాలించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.

చైనాలోకి పూర్తిగా దిగుమతులను ఆపేసి స్వదేశీ మార్కెట్ ను ప్రోత్సహించేలా చైనా పంచవార్షిక ప్రణాలికను గురువారం ఆమోదముద్రవేశారు. ఈ సదస్సులో భాగంగా విజన్ 2035 పేరుతో మరొక 15 ఏళ్ళు తనను ఎవరు కదపకుండా చాప కింద నీరులా తన ఖ్యాతిని పెంచుకుంటూ ప్రతిపక్ష పార్టీలను లెక్కలేని తనంగా తీసేసి ముందుకుపోతున్నారు. చైనాలో ఇప్పటికే అక్కడ ప్రజలు జింగ్ పింగ్ వ్యవహారశైలిపట్ల వ్యతిరేకంగా ఉన్నా అతడు తనకు వ్యతిరేకంగా గళం విప్పినవారిని తొక్కుకుంటూ జీవితాంతం తానే అధ్యక్షుడుగా ఉండాలన్న సంకల్పాన్ని విజయవంతంగా ముగించేలా రాచమార్గాలను వేసుకుంటున్నాడు.