‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ‘జెర్సీ’ చిత్రం క్రికెట్ నేపథ్యంలో.. ఓ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతుందని.. సీన్స్ అనుకున్నదాని కంటే బాగా వస్తున్నాయని తెలుస్తోంది.

కాగా వాలెంటెన్స్ డే సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ చిత్రం నుండి ‘అదేంటోగాని ఉన్నపాటుగా’ అనే సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా నాని కెరీర్ లో ఓ మంచి సినిమా అవుతుందని ఇండస్ట్రీ టాక్ గా వినిపిస్తుంది. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •