‘సైరా’ సినిమా హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలు కానుంది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటించబోతున్నారట. ఓ సామాజిక అంశం నేపథ్యంలో శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుంది.

ఇక ఈ సినిమా కోసం చిరంజీవి తన పాత్రకు తగట్టుగా తనను మలుచుకునేందుకు జిమ్ లో కష్టపడుతున్నారు. 64 ఏళ్ళ వయసులో వృత్తి దర్మం కోసం కష్టపడుతున్న చిరుని చూసి ఫాన్స్ తెగ ఆనందపడుతున్నారు. జిమ్ లో చిరు డంబెల్స్ ఎత్తుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..