ప్రతి ఏడాది పండగ పూట మంచి ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే జియో సంస్థ ఈసారి బ్యాడ్ న్యూస్ ను తమ కస్టమర్ల గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉండేది. కానీ ఇక నుంచి అన్ లిమిటెడ్ సదుపాయం ఎత్తివేసి నిమిషానికి 6 పైసలు వాసులు చేయాలని జియో నెట్వర్క్ భావిస్తుంది. జియో నుంచి జియో కు కాల్స్ చేస్తే పూర్తిగా ఉచితంగా, జియో నుంచి ఇతర నెట్వర్క్ లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నారు.

ఇక మీరు ఇతర ఆపరేటర్లకు చెల్లించే రుసుమును డేటా రూపంలో తిరిగి పొందే అవకాశాన్ని జియో కల్పిస్తుంది. అంటే మీరు వంద నిముషాలు ఫోన్ ఇతర నెట్వర్క్ వారితో మాట్లాడితే 6 రూపాయలు చెల్లించాలి, ఈ 6 రూపాయలకు సంబంధించిన డేటాను తిరిగి జియో మీకు అందిస్తుంది.ఈ ఇంటర్ కనెక్ట్ యూజర్ చార్జీలు వసూలు ట్రాయ్ ఇచ్చిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అక్టోబర్ 10 తరువాత రీఛార్జ్ చేసుకునే వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని, ఇప్పటి వరకు తాము కస్టమర్ల నుంచి కాల్స్ కు ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని, కేవలం డేటాకు మాత్రమే వసూలు చేస్తున్నామని జియో సంస్థ తెలియచేసింది. కేవలం ట్రాయ్ నుంచి వస్తున్న వత్తిడి మేరకే తాము ఇలా చార్జీలు వసూలు చేయవలసి వస్తుందని, ఒకవేళ ట్రాయ్ కనుక ఐయుసీ చార్జీలను ఎత్తివేసినట్లైతే తాము కూడా కస్టమర్ నుంచి నిమిషానికి 6 పైసలను వసూలు చేయమని తెలిపింది.

ట్రాయ్ ఐయుసీ చార్జీలను జనవరి 1, 2020 నుంచి ఎత్తివేసే సూచనలు ఉన్నాయని, అప్పటి వరకు కాల్స్ కు చార్జీలు వసూలు చేసి దానిని డేటా రూపంలో తిరిగి ఇవ్వనున్నామని తెలియచేసింది. ఇందుకోసం 10 నుంచి 100 రూపాయల వరకు టాప్ అప్ రీచార్జులు అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలియచేసింది. ఇక జియో తీసుకున్న నిర్ణయంతో మిగతా టెలికాం సంస్థలు కూడా అదే దారిలో నడవనున్నాయి. గత కొద్ది రోజులుగా ట్రాయ్ వసూలు చేసే ఈ ఆరు పైసల గురించి ఇతరులకు ఫోన్ చేసినప్పుడు రింగ్ ను తగ్గించి సరికొత్త గేమ్ కు టెలికాం సంస్థలు తెరతీశాయి. చివరకు ఇలా నేరుగా ఆ భారం వినియోగదారుడు మీదనే వేయనున్నారు.