టెలికాం రంగంలో జియో అడుపెట్టిన తరువాత వచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో ఎప్పటికప్పుడు తమ ప్లాన్ లను సవరించుకుంటూ కస్టమర్లను పక్క చూపులు చూడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. అందరి కన్నా ముందు వరుసలో ఉన్న జియో ఇప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్శించేందుకు, పాత కస్టమర్లను ఇంకా సంతృప్తి పరిచేందుకు సరికొత్త ప్లేన్ తో ముందుకు వచ్చింది.

ఇప్పడూ జియో 99 రీఛార్జ్ ప్యాక్ తో 14 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తుంది. 28 రోజుల కాలపరిమితి ఉండే ఈ ఆఫర్ కింద రోజుకి 0.5 జీబీ డేటా చొప్పున 14 జిబిని 28 రోజులు వాడుకోవచ్చు. ఉచితంగా 300 ఎస్ఏంఎస్ లను కూడా అందిస్తుంది. కానీ ఈ ఆఫర్ జియో ఫోన్ లలో వాడే సిం లకు మాత్రమే అని చిన్న మతలబు పెట్టింది. కానీ ఇది ఇప్పుడు ఉన్న అన్ని ఆఫర్స్ కంటే బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆఫర్ తో జియో ఫోన్ లతో పాటు, ఆఫర్ పై కూడా ప్రజలు ఆసక్తి కనపరుస్తారని జియో అంచనా వేస్తుంది.

Tags: Jio, My Jiyo, Jio Mobile, Jio Best offers, Jio 99 Pack Offer
  •  
  •  
  •  
  •  
  •  
  •